పురపాలికల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీలకు కూడ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. రేపు జరిగే మూడో దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణఫై సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్‌తో సమావేశమైన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆ ఎన్నికల నిర్వహణపై కూడ ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి 14న పురపాలికల ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తికానుండగా ఆ తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలా,గతంలో నిలిపిన చోట నుంచే కొనసాగించాలా అనే దానిపై ఎస్ఈసీ న్యాయనిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో వైసీపీ అక్రమాలతో ఏకగ్రీవాలు చేసిందని విపక్షాలు ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. వీటిపై ఎస్ఈసీ జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు కోరినట్లు తెలుస్తోంది. వీటన్నింటిని సమగ్రంగా పరిశీలించిన మీదట ఎస్ఈసీ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Must Read ;- ఏకగ్రీవాలు విత్ హెల్డ్.. ఫిర్యాదులపై ఎస్ఈసీ విచారణ











