కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ కేసులు పెరుగుతున్నాయి. ఎంతో మంది దీని బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఎందరో సినీ సెలబ్రిటీస్ తమ వంతు ఆర్ధికసాయం చేస్తున్నారు. టాలీవుడ్ లో ఎందరో కరోనా పై పోరాటానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తుండగా.. తమిళ నాట కూడా చాలా మంది సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. భారీ మొత్తంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందిస్తున్నారు.
ఇటీవల దర్శకుడు ఎ.ఆర్. మురగదాస్, సూర్య ఫ్యామిలీ, తల అజిత్ .. అలాగే మరికొందరు భారీ మొత్తంలో ఆర్దిక సహాయాన్ని అందించగా.. ఈ లిస్ట్ లోకి ఇప్పుడు తమిళ దర్శకుడు శంకర్ కూడా చేరారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆయన రూ. 10లక్షలు ట్రాన్స్ ఫర్ చేశారు. ప్రస్తుతం శంకర్ కమల్ తో ఇండియన్ 2 రూపొందించే హడావిడిలో ఉన్నారు. ఇది పూర్తయ్యాకా.. రామ్ చరణ్ తో పాన్ ఇండియా మూవీ రూపొందించబోతున్నారు.
Must Read ;- కరోనాతో కాదు ఆకలి చావులేనంటున్న సినీ జనం
Director Shankar donated 10 Lakhs (Through Online Transaction) to the CM relief fund in the aid of corona relief #CovidRelief #TNCMReliefFund@shankarshanmugh @teamaimpr pic.twitter.com/cJ4ylr4DlG
— BARaju (@baraju_SuperHit) May 16, 2021