టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమ్మర్ లో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ మూవీని రిలీజ్ చేయడం.. ఆ సినిమా విజయం సాధించడం తెలసిందే. పవర్ స్టార్ తో వకీల్ సాబ్ మూవీని నిర్మించిన దిల్ రాజు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేశారు. ఇది రామ్ చరణ్ కి 15వ సినిమా కాగా, దిల్ రాజుకి 50వ చిత్రం కావడం విశేషం. దీంతో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి ప్లాన్ చేశారు. జూన్ లేదా జులై నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకున్నారు.
అయితే.. శంకర్.. భారతీయుడు 2 సినిమాని తెరకెక్కిస్తున్నారు. కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమా చాలా సార్లు ఆగిపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. అయితే… చాలా సార్లు ఈ సినిమా ఆగిపోవడంతో ఇక భారతీయుడు 2 సినిమాను పూర్తిగా ఆపేశారు అంటూ వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో సినిమాని అనౌన్స్ చేసినప్పుడు భారతీయుడు 2 నిర్మాణ సంస్థ కోర్టుకెక్కింది. కారణం ఏంటంటే.. శంకర్ మా సినిమాని కంప్లీట్ చేయకుండా వేరే సినిమాను ఎలా చేస్తారని ప్రశ్నించింది.
ఈ వివాదంలో ఉన్న శంకర్ అపరిచితుడు బాలీవుడ్ రీమేక్ చేయనున్నట్టుగా కూడా ప్రకటించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. అయితే.. భారతీయుడు 2 కంప్లీట్ చేయడానికి కమల్ హాసన్ డేట్స్ ఇవ్వడానికి కూడా రెడీ అన్నారు. ఈ వివాదం పరిష్కారం అవ్వాలి. అప్పుడు శంకర్ రామ్ చరణ్ తో సినిమా స్టార్ట్ చేయాలి. ఇదంతా జరగడానికి టైమ్ పట్టచ్చు. అందుచేత… చరణ్ – శంకర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తే.. ఇలా అడ్డంకులు వచ్చాయి ఏంటి అని దిల్ రాజు బాగా ఫీలవుతున్నారట. మరి.. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.
Must Read ;- సూర్య, బోయపాటి, దిల్ రాజు కాంబినేషన్ లో భారీ చిత్రం