నగరి ఎమ్మెల్యే రోజా అనారోగ్యతంతో ఆసుపత్రిలో చేరారు. చెన్నై అడయార్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. ఉన్నట్టుండి సడెన్‌గా రోజా ఆసుపత్రిలో చేరడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రోజాకు ఏమైందని ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. రోజాకు ఏమైందంటూ వదంతులు వ్యాపిస్తుండటంతో ఆమె భర్త ఆర్కే సెల్వమణి స్పందించారు. చెన్నై అడయార్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో రోజాకు ఫైబ్రాయిడ్ శస్త్రచికిత్స జరిగిందని తెలిపిన ఆయన.. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు.
Also Read:రోజా ‘కన్నీటి’ కష్టాలకు.. ప్రాధాన్యం తగ్గటమే కారణమా?











