ఛలో సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సక్సస్ సాధించిన కన్నడ భామ రష్మిక. ఆతర్వాత దేవదాస్, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ.. ఇలా వరుసగా సక్సస్ ఫుల్ మూవీస్ లో నటించింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా, క్రేజీ హీరోయిన్ గా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటిస్తుంది. ఈ అమ్మడు టాలీవుడ్ సినిమాల్లోనే కాకుండా ఇటీవల కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. అలాగే బాలీవుడ్ లోకూడా ఎంట్రీ ఇచ్చింది.
ఇలా ఈ అమ్మడు క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారును ఇట్టే ఆకట్టుకుంటుంది. అందుకనే ఆ వుడ్ ఈ వుడ్ అని తేడా లేకుండా అన్ని వుడ్ లలో రష్మిక పేరు మారుమ్రోగుతుంది. తన సినిమాల గురించి.. తన పర్సనల్ విషయాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ… బాగా యాక్టీవ్ గా ఉంటుంది. అందుకనే సోషల్ మీడియాలో రష్మిక అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే.. ఈ అమ్మడు సోషల్ మీడియా విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకోవాలి అనుకుందట. ఇంతకీ ఏంటంటే.. కరోనా సెకండ్ వేవ్‌కు ముందు పూర్తిగా సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుందట.
ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్వూలో తెలియచేసింది. కారణం ఏంటంటే.. కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని అర్థమైంది. అవి ఎంతో బాధను ఇవ్వడం కాక, మానసిక శాంతిని దూరం చేస్తాయి. సోషల్ మీడియాలో ఆ వార్తలను చూసి తట్టుకోలేననే ఉద్దేశ్యంతో గుడ్ బై చెప్పాలనుకున్నాను. అయితే.. అలా చేయలేకపోయాను. ఈ సంక్షోభ సమయంలో సామాన్య ప్రజలకు సహాయం చేస్తున్న వారిలో స్ఫూర్తి నింపాలని కోరుకున్నా. అందుకే ‘spreading hope’ను ప్రారంభించాను’ అంటూ అసలు విషయం బయటపెట్టారు అందాల రష్మిక.
Must Read ;- రష్మికకు ముద్దొచ్చి చంకనెక్కిన కుక్కపిల్ల











