క్షుద్రపూజలను నమ్ముకుని అత్యంత కిరాతకంగా కూతుళ్లు ఇద్దరినీ మట్టుబెట్టిన తల్లిదండ్రుల తరఫున సుప్రీం కోర్టులో ప్రఖ్యాత లాయర్ పివి కృష్ణమాచార్య కోర్టులో వాదించబోతున్నారు. రాష్ట్రమంతా సంచలనం సృష్టిస్తున్న కూతుళ్లిద్దరి హత్యకేసులో, ఇప్పటిదాకా వచ్చిన అన్ని వివరాల్లోకి.. ఇది బిగ్ ట్విస్ట్ అని పలువురు భావిస్తున్నారు.
నిందితులు పురుషోత్తం నాయుడు, పద్మజల తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది పివి కృష్ణమాచార్య స్వచ్ఛందంగా వాదించనున్నారు. ఈ కేసు ఇప్పటికే దేశవ్యాప్తంగా సంచలన అంశంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే.
పివి కృష్ణమాచార్య సుప్రీం కోర్టు న్యాయవాదిగా సుప్రసిద్ధులు. సంచలనం సృష్టించిన ‘దిశ‘ కేసులో
ఎన్ కౌంటర్ కు వ్యతిరేకంగా ఇదివరకే కోర్టులో న్యాయవాది పీవీ కృష్ణమాచార్య వాదిస్తున్నారు.
మదనపల్లె కేసులో ఏ-1 గా ఉన్న ప్రొఫెసర్ పురుషోత్తం నాయుడు దగ్గర విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థుల అభ్యర్ధన మేరకు అడ్వొకేట్ కృష్ణమాచార్య ఈ కేసులో వాదనకు సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కేసు గురించి తన జూనియర్ రజనీ ద్వారా కృష్ణమాచార్య వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.
Must Read ;- చంపేసి, నోట్లో రాగిచెంబులు పెడ్తే.. రేపు ఉదయం లేస్తారా?











