Sharwanand Waiting For Great Comeback :
మొదటి నుంచి కూడా శర్వానంద్ నిదానమే ప్రధానం అన్నట్టుగా కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. వరుసగా చకచకా సినిమాలు చేసేయాలనే ఆరాటాన్ని ఆయన ఎప్పుడూ కనబరచలేదు. నిదానంగా ఒక్కో సినిమాను చేసుకుంటూ వస్తున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలకు మాత్రమే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంలో నాని తరువాత శర్వానంద్ పేరే వినిపించేది. అయితే ఇటీవల కాలంలో నాని మాదిరిగా ఆయన తన సక్సెస్ రేటును కొనసాగించలేకపోడు.
కథాకథనాల్లో కొత్తదనం .. పాత్రలలో వైవిధ్యం చూసుకునే ఆయన ఇటీవల కొన్ని సినిమాలు చేశాడు. అయితే అవి దెబ్బకొట్టేశాయి. ‘మహానుభావుడు‘ తరువాత ఆయన ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు. ‘పడి పడి లేచె మనసు’.. ‘శ్రీకారం‘ సినిమాలపై శర్వా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఆయన అభిమానులు కూడా ఈ సినిమాలు హిట్ కొట్టడం ఖాయమనే అనుకున్నారు. ఎక్కడ తేడా కొట్టిందో తెలియదుగానీ, ఈ సినిమాలు ఆశించినస్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. శర్వా స్థాయి సినిమాలే అయినా, విజయానికి దూరంగానే ఉండిపోయాయి.
ప్రస్తుతం శర్వానంద్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అజయ్ భూపతి దర్శకత్వంలో ఆయన ‘మహా సముద్రం‘ చేస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, మల్టీ స్టారర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే కొత్త దర్శకుడితో ఆయన ‘ఒకే ఒక జీవితం’ చేస్తున్నాడు. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, అమల అక్కినేని ఒక కీలకమైన పాత్రను పోషిస్తుండటం .. తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనుండటం విశేషం. ఇక కిషోర్ తిరుమల దర్శకత్వంలోని ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ లైన్లో ఉండనే ఉంది. ఇందులో రష్మిక కథానాయికగా అలరించనుంది. ఈ మూడు సినిమాలు శర్వా సక్సెస్ గ్రాఫ్ ను ఎంతవరకూ పెంచుతాయో చూడాలి మరి.
Must Read ;- అజేయ దర్శకుడితో శర్వానంద్ సినిమా?











