ప్రియాంక అరుళ్ మోహన్ .. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. ముత్యపుచిప్పల్లాంటి కళ్లు .. పల్చని పెదాలు .. సన్నజాజి మొగ్గలాంటి నాసికతో ఈ అమ్మాయి తెరపై విరిసింది. తమలపాకు వంటి ఈ అమ్మాయిని చూసిన కుర్రాళ్లు, ఊహ తెలిసిన తరువాత ఇంత నాజూకుదనాన్ని చూడలేదని అనుకున్నారు. మనసును మందిరాలుగా మార్చేసుకుని, అందులో ఆమె ప్రతిమను ప్రతిష్ఠ చేసేసుకున్నారు. ఆమె అభిమానులుగా గుండెలపై గుర్తింపు కార్డులు వేసుకున్నారు. అలా తొలి సినిమాతోనే ఈ సుందరికి యూత్ లో ఫాలోయింగ్ పెరిగిపోయింది.
నాని తరువాత కథల ఎంపికలో ఆ స్థాయిలో కనిపించే శర్వానంద్ తో ఈ అమ్మాయి ‘శ్రీకారం‘ చేసింది. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందని ప్రియాంక భావించింది. కానీ ఆశించినస్థాయిలో ఆ సినిమా ఆదరణ పొందలేకపోయింది. ప్రస్తుతం తమిళంలో ప్రియాంక చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. శివకార్తికేయన్ జోడీగా రెండు సినిమాలు, సూర్య సరసన ఒక సినిమా చేస్తోంది. కానీ తెలుగులో మాత్రం ఆమె జోరు కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి గనుక, కుందనపుబొమ్మ వంటి ఈ అమ్మాయి, ఇక్కడ కూడా కుదురుకుంటుందేమో చూడాలి.
Must Read ;- అందాల ఆరబోతలో ఈ ‘కాంతా’ లగా మెరుపులే