నందమూరి అభిమానులు బాలయ్య, బోయపాటి మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు ఎనౌన్స్ చేస్తారా.? అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ ద్వారాక క్రియేషన్స్ ప్రకటించడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టాలీవుడ్ లో ఇప్పుడు రిలీజ్ డేట్స్ జాతర జరుగుతుంది. ప్రభాస్ రాధేశ్యామ్, విజయ్ – పూరి లైగర్ రిలీజ్ డేట్స్ తప్పా మిగిలిన అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేసేశారు.
ఇప్పుడు బాలయ్య మూవీని ఎన్టీఆర్ జయంతి రోజైన మే 28న రిలీజ్ చేయనున్నట్టుగా అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు. దాంతో తండ్రి ఎన్టీఆర్ జయంతి రోజున తనయుడు బాలయ్య సినిమా రిలీజ్ చేస్తుండడంతో ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ పై అటు అభిమానుల్లోను ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
మే నెలలో చిరంజీవి ఆచార్య, వెంకీ నారప్ప సినిమాలతో పాటు ఇప్పుడు బాలయ్య సినిమా కూడా రాబోతుండడం విశేషం.
బాలయ్య, బోయపాటి కలిసి సింహ, లజెండ్ చిత్రాలు చేశారు. ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయ. దాంతో మూడవసారి కలిసి చేస్తున్న ఈ భారీ యాక్షన్ మూవీ పై నందమూరి అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి.. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య బాబు ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో చూడాలి.
Must Read ;- చిరుతో పోటీకి సై అంటున్న బాలయ్య?











