Court Given Green Signal To YS Chowdary To Fly Abroad :
నిజంగానే.. ఈ వార్త బీజేపీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త వై.సుజనా చౌదరి అమెరికా పర్యటనలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు శనివారం సాయంత్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు అనుమతితో సుజనా చౌదరి సోమవారమే అమెరికా ఫ్లైట్ ఎక్కనున్నారు. వచ్చే నెల 11లోగా ఆయన ఆ దేశ పర్యటనను ముగించుకుని తిరిగి వస్తారు.
పూచీకత్తు ఇచ్చి ఇరుక్కున్నారా?
సుజనా చౌదరి కొన్ని కంపెనీలు తీసుకున్న రుణాలకు సంబంధించి బ్యాంకులకు పూచీకత్తు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సంస్థలు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన నేపథ్యంలో గ్యారెంటర్ గా ఉన్న సుజనాకు బ్యాంకులు నోటీసుల జారీ, ఆ తర్వాత కోర్టులను ఆశ్రయించడం. వెంటవెంటనే వేగంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సుజనాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లాలంటే.. ఆయనకు కోర్టు అనుమతి తప్పనిసరి అయ్యింది.
పర్యటనకు నెల వ్యవధి
ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్ కాన్ సంట్రేటర్లకు సంబంధించి సదస్సుకు హాజరు కావాలంటూ అమెరికా నుంచి సుజనాకు ఆహ్వానం అందింది. ఈ మేరకు తన అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ సుజనా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలను అడిగిన కోర్టు… అవన్నీ అందిన నేపథ్యంలో సుజనా పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 12న అమెరికా బయలుదేరనున్న సుజనా.. తిరిగి వచ్చే నెల 11లోగా తిరిగి వస్తారు.
Must Read ;- చరిత్ర సృష్టించబోతున్న తెలుగు అమ్మాయి.. అంతరిక్షంలోకి అడుగిడుతున్న శిరీష బండ్ల











