సన్నిలియోన్ అంటే తెలియని వారు ఈ జెనరేషన్ కుర్రోళ్లలో ఉండనే ఉండరు. ఆమె పేరే ఒక వైబ్రేషన్. ఆమె అందాలు అందరికీ సెలబ్రేషన్. విదేశీ వనిత అయినప్పటికీ.. బాలీవుడ్ యూత్ ఆమెను బాగా ఓన్ చేసుకున్నారు. తమ గుండెల్లో ఆమెకో గుడిని కూడా కట్టేసుకున్నారు. బాలీవుడ్ సినిమాల్లో ఐటెమ్ గాళ్ గా, హీరోయిన్ గా.. వివిధ రకాలుగా మెప్పించిన ఆమె.. ఇతర భాషా చిత్రాల్లో కూడా తన అందాలతో మెప్పించింది. బాలీవుడ్ లో ప్రస్తుతం ఆమె లీడింగ్ లో ఉన్న శృంగార తార.
ప్రస్తుతం సన్నీలియోన్ .. భర్త, ముగ్గురు పిల్లలతో ముంబై లో ఫ్యామిలీ లైఫ్ చక్కగా ఎంజాయ్ చేస్తోంది. దంపతులిద్దరికీ కొన్ని వ్యాపారాలుండడంతో .. మొత్తం నాలుగు చేతులతో సంపాదిస్తూ.. ఆమె ముంబై లో స్థిర పడేందుకు సన్నాహాలు చేస్తోంది. అసలు విషయానికొస్తే.. ఇటీవల సన్నీలియోన్ ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఇప్పటికే అక్కడ బెవర్లీ హిల్స్.. షెర్మాన్ హోక్స్ లో ఓ బంగ్లా ఉండగా.. లేటెస్ట్ గా అంధేరీలో ఒక సరికొత్త ఫ్లాట్ కొనుగోలు చేసింది.
బాలీవుడ్ సమాచారం ప్రకారం.. నిర్మాణంలో ఉన్న అట్లాంటిస్ అపార్ట్ మెంట్స్ లో 12వ అంతస్థు కొనుగోలు చేసిందట సన్నీలియోన్. దాని ఖరీదు ఇంచుమించు రూ. 16 కోట్లు. ఈ అపార్ట్ మెంట్ ను కరణ్ జిత్ కౌర్ వోహ్రా పేరుతో రిజిస్టర్ చేయించుకుందట. సో.. మొత్తం మీద సన్నీలియోన్ ముంబైలో అపార్ట్ మెంట్ కొనుగోలు చేసి.. అందరికీ షాకిచ్చిందన్నమాట.
Must Read ;- తడిసిన అందాలతో అలసిన సన్నీ లియోన్