మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన భామల్లో అందరూ చాలా గ్లామరస్ గా ఉంటారు. కానీ వారిలో కొందరు స్ర్కీన్ మీద మాత్రం వట్టి పెర్ఫార్మర్ స్థానాన్నే తీసుకుంటారు. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ.. తమలోని గ్లామర్ యాంగిల్ ను మాత్రం బైటికి తీయరు. అలాంటి ఓ టాలెంట్ భామ నివేదా థామస్.
2008 నుంచి మలయాళ చిత్ర సీమలో కథానాయికగా నటిస్తోన్న నివేదా .. ఎనిమిదేళ్ళ తర్వాత ‘జెంటిల్ మేన్’ సినిమాతో టాలీవుడ్ లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే అమ్మడు మంచి పెర్ఫార్మర్ అని టాలీవుడ్ జనం గుర్తించారు. ఆ తర్వాత మరిన్ని చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకుంది ఆమె. అప్పటి నుంచి నివేదా టాలీవుడ్ పరిశ్రమలో కథానాయికగా స్థిరపడిపోయింది. రీసెంట్ గా ‘వకీల్ సాబ్’ లో కీలకమైన పాత్ర పోషించి శభాష్ అనిపించుకుంది నివేదా.
అయితే నివేదా థామస్ కు తాను ఎన్ని సినిమాల్లో కథానాయికగా నటించినా రాని సంతృప్తి డైరెక్షన్ వల్ల వస్తుందని చెబుతోంది. నిజానికి తాను డైరెక్టర్ అవుదామనే ఇండస్ట్రీలోకి వచ్చిందట. కెరీర్ బిగినింగ్ లో డైరెక్షన్ కోర్స్ కూడా చేసిందట. కొన్ని సినిమాల్లో మాత్రమే నటించి.. షార్ట్ ఫిల్మ్స్ చేసి.. డైరెక్షన్ లో ప్రూవ్ చేసుకొని ఒక సినిమాను డైరెక్ట్ చేస్తుందట. ఇదే తన లక్ష్యమని చెబుతోంది. మరి నివేదా ఎప్పటికి మెగా ఫోన్ పట్టుకుంటుందో చూడాలి.
Must Read ;- గ్లామర్ అక్కర్లేదు.. మంచి క్యారెక్టర్ ఇవ్వండి చాలు