పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం సలార్. ఈ సినిమాని ఇటీవల హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫాస్ట్ గా జరుగుతుంది. జనవరి నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఫిబ్రవరి నుంచి సలార్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో నటించే హీరోయిన్ ఎవరు అనేది ఇంకా అఫిషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ పేరు వినిపించింది. అయితే.. ఇప్పుడు దిశా పటానీ కాకుండా శృతి హాసన్ ని తీసుకోవాలి అనుకుంటున్నారని తెలిసింది. శృతిహాసన్ ఇటు సౌత్ ఆడియన్స్ కి, అటు నార్త్ ఆడియన్స్ కి తెలుసు. పైగా రెమ్యూనరేషన్ విషయంలో పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు అనే ఉద్దేశ్యంతో శృతిహాసన్ ఎంపిక చేయనున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. కెరీర్ లో కాస్త వెనకబడిన శృతిహాసన్ కి ‘సలార్’ లో నటించే అవకాశం అంటే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే.
ఇటీవల ‘క్రాక్’ మూవీతో సక్సస్ సాధించి ఫామ్ లోకి వచ్చింది. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నటించే అవకాశం వస్తే.. మరిన్ని అవకాశాలు రావడం ఖాయం. దాదాపు శృతిహాసన్ నటించడం కన్ ఫర్మ్ అంటూ వార్తలు వస్తున్నాయి. మరి.. ‘సలార్’ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.
Must Read ;- శృతిహాసన్ మళ్లీ లవ్ లో పడిందా?