నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. సినిమా షూటింగ్ కు అంతరాయం కలగడమే కాకుండా.. రిలీజ్ డేట్ కూ అడ్డంకి ఏర్పడింది. ప్రస్తుతం క్లైమాక్స్ మినహా ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయిందని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఏడాదే ‘అఖండ’ సినిమా విడుదలవుతుంది.
ఇదిలా ఉంటే.. బాలయ్య తదుపరి చిత్రాన్ని ‘క్రాక్’ ఫేమ్ గోపీచంద్ మలినేని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. మొన్నామధ్య బాలకృష్ణ .. దర్శకుడి కథను ఓకే చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతోంది సినిమా. పల్నాడు బ్యాక్ డ్రాప్ లోని చారిత్రక కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు. ఇక ఇందులో బాలకృష్ణకి జోడీగా శ్రుతి హాసన్ ఖాయం చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
జూలైలో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళే ఆలోచనలో గోపీచంద్ మలినేని ఉన్నాడట. అలాగే.. సినిమాను సరిగ్గా ఐదు నెలల్లో కంప్లీట్ చేసి.. వచ్చే సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ ఏడాది సంక్రాంతికి గోపీచంద్ .. రవితేజ తో రూపొందించిన క్రాక్ మూవీ బ్లాక్ బస్టరైన సంగతి తెలిసిందే. అందుకే ఆ సెంటిమెంట్ తో సినిమాను ఆ సీజన్ లో విడుదల చేస్తాడట. అలాగే.. సంక్రాంతి సీజన్ బాలయ్యకి మంచి సెంటిమెంట్. మరి ఈ వార్తలో నిజానిజాలేంటో చూడాలి.
Must Read ;- బాలకృష్ణను పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేయబోతున్న అజేయ దర్శకుడు











