‘ఆర్.ఎక్స్ 100’ మూవీతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించాడు దర్శకుడు అజయ్ భూపతి. తొలి సినిమా తెచ్చిపెట్టిన సూపర్ ఫేమ్ తో ఈ పాటికి ఈ డైరెక్టర్ .. రెండో సినిమాని కూడా విడుదల చేసి ఉండాలి లెక్క ప్రకారం. కానీ.. దర్శకుడిగా అతడి రెండో అడుగు అనుకున్నంత ఈజీగా పడలేదు. తను రాసుకున్న కథకి తగ్గ కేస్టింగ్ సెట్ అవక అజయ్ భూపతి నానా కష్టాలు పడ్డాడు. ముందుగా రవితేజ హీరో అనుకున్నాడు. కుదరలేదు. తర్వాత నాగచైతన్య తో ప్రయత్నించాడు . అదీ సాధ్యం కాలేదు. ఎట్టకేలకు టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా సెట్ అయ్యాడు. అలాగే.. మరో హీరోగా ‘బొమ్మరిల్లు’ బాయ్ సిద్ధార్ధ కుదురుకున్నాడు.
‘మహాసముద్రం’ టైటిల్ తో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళిన అజయ్ భూపతి.. ప్రస్తుతం గోవా , విశాఖ బీచెస్ లో షూటింగ్ చేస్తున్నాడు. అదితీరావు హైదరీ హీరోయిన్ గా ఓ డిఫరెంట్ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇండస్ట్రీ వర్గాల వారి సమాచారం ప్రకారం ఇందులో అదతీరావు .. నెగెటివ్ కేరక్టర్ చేస్తోందట. ఇందులో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఆ సమ్మోహనిని తెరమీద అలా చూడడం నిజంగా ఆశ్చర్యమే.
రీసెంట్ గా అజయ్ భూపతి శర్వానంద్, సిద్ధార్ధలతో సెల్ఫీ దిగి.. దాన్ని తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశాడు. ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్ తో పనిచేయడం నిజంగా సంతోషాన్నిస్తోందని, అలాగే.. సెట్ లో అంతా పాజిటివ్ వైబ్స్ ఉన్నయని చెబుతున్నాడు. మహా అనే ఒక అమ్మాయి ఇద్దరి అబ్బాయిలకు సముద్రమంతటి తన ప్రేమను పంచడమే ఈ సినిమా కథాంశమని అంటున్నారు. ఆగస్ట్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానున్న మహాసముద్రం సినిమా శర్వాకి, సిద్ధార్ధకి ఏ రేంజ్ హిట్టిస్తుందో చూడాలి.
Must Read ;- మహాశివరాత్రి రోజునే శర్వానంద్ శ్రీకారం