ఏపీముఖ్యమంత్రి న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులపై చేసిన వ్యాఖ్యల వ్యవహారం ఇవాళ సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జడ్జిలకు దురుద్దేశాలు ఆపాదించడంలో ఏదైనా దురుద్దేశం, కుట్ర ఉన్నదా? అది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందా? అనేది తీవ్రమైన చర్చ!
ఏపీలోని అధికార వైసీపీ పెద్దలు న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసి పెద్ద తప్పే చేశారనిపిస్తోంది. ఏపీ హైకోర్టులోని ఐదుగురు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణపై వైసీపీ ప్రభుత్వం అనుచిత వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నిస్తూ నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే లేఖలు రాశారు. అంతటితో ఆగకుండా ఏపీ ప్రభుత్వ సలహాదారు కల్లాం అజేయరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ కోర్టు తీర్పులను తప్పుపట్టారు. సుప్రీం కు రాసిన లేఖను బహిరంగపరిచారు.
ఒక కోర్టులో న్యాయం జరగలేదనిపిస్తే, మరో పైకోర్టుకు వెళ్లే అవకాశం దేశంలో ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ అలా చేయకుండా కోర్టు తీర్పులను తప్పుపట్టి, న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదించి ఏపీ ప్రభుత్వం పెద్ద తప్పే చేసింది. న్యాయవ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీలోని కొందరు ప్రముఖ న్యాయవాదులు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈ కేసు నేడు విచారణకు రానుంది.
Also Read ;- న్యాయ వ్యవస్థతో ఎందుకు సామీ.. నీకు..?
కోర్టు ధిక్కరణగా పరిగణిస్తారా?
గత నెల 6న హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జిపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై సుప్రీంకోర్టుకు చెందిన ప్రఖ్యాత న్యాయవాది అశ్వనీకుమార్ పిటిషన్ వేశారు. అశ్వనీ కుమార్ వేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకు లిస్ట్ అయ్యాయి. ఈ కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. దీనిపై న్యాయమూర్తి ఎలాంటి తీర్పునిస్తారోనని, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఈ కేసులో సుప్రీంకోర్టు ఏపీ సీఎంకు రెండు రోజుల జైలు శిక్ష విధించినా సీఎం రాజీనామా చేయాల్సి వస్తుందని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్టం రాజు చేసిన వ్యాఖ్యలతో ఈ కేసుపై జనానికి మరింత ఆసక్తి పెరిగింది.
ఏపీ సీఎంకు నోటీసులు జారీ అవుతాయా?
న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇవాళ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు రెండే దారులున్నాయని న్యాయ కోవిదులు భావిస్తున్నారు. జరిగిన తప్పును అంగీకరించి సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పడం లేదంటే, సీఎం పదవికి రాజీనామా చేసి ఆ సీటులో వారికి కావాల్సిన వారిని కూర్చోబెట్టడం. ఈ రెండింటిలో ఏది జరుగుతుందనే దానిపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా సుప్రీంకోర్టు తీర్పుకోసం వేచిచూస్తున్నారు.
Also Read ;- alert : పెద్దిరెడ్డి తండ్రీకొడుకులపై జగన్ నిఘా నేత్రం!
ఏపీ సీఎంఓలో రెండు రోజులుగా ఎడతెగని చర్చలు
ఏపీ సీఎంఓలో రెండు రోజులుగా ఈ వ్యవహారంపై ఎడతెగని చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. అయితే ఎక్కడా బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రెండు రోజుల నుంచి కనీసం వైసీపీ అధినేత భార్య నడుపుతున్న పత్రికకు చెందిన విలేకరులను కూడా సీఎంఓలోకి రానీయలేదు అంటే ఎంత గోప్యత పాటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సీఎంఓలో హడావుడి, రహస్య చర్చలు గమనిస్తున్న కొన్ని వర్గాలు ఏదో జరగబోతోందనే సంకేతాలు వస్తున్నాయని ఆఫ్ ద రికార్డుగా చెబుతున్నారు. ఇదంతా ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం ఎలా? తాము ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాం అదే దానిని డిఫెండ్ చేసుకునే అంశాలపై తీవ్ర కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.
కల్లాం అజయ్ రెడ్డి అడ్డంగా ఇరికించారా?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆయన సలహాదారు అజేయకల్లాంరెడ్డి అడ్డంగా ఇరికించారని పార్టీ వారే అనుకుంటున్నారు. కోర్టు తీర్పులను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదనే విషయం ఈ మాజీ ఐఏఎస్ కు తెలియని విషయం కాదు. కోర్టు తీర్పు నచ్చకపోతే పైకోర్టుకు వెళ్లవచ్చనే విషయం మరచి, న్యాయవ్యవస్థ తీర్పులనే ప్రశ్నిస్తూ బహిరంగంగా మీడియా సమావేశం పెట్టి పెద్ద తప్పే చేశారని న్యాయవాదులు విశ్లేషిస్తున్నారు. ఈ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనే దానిపై అన్నివర్గాల ప్రజలు ఎంతో ఆసక్తితో ఉన్నారు.
Also Read ;- జగన్ ను సీఎంగా తొలగించాలి… సుప్రీంకోర్టులో పిటీషన్!