March 25, 2026 2:37 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Culture

కాలంలోకి ప్రయాణం.. టైమ్ మెషీన్ 360

ఇప్పటిదాకా టైమ్ మెషీన్ గురించి మనం సినిమాలు చూశాం, కథల్లో విన్నాం అసలు టైమ్ మెషీన్ అంటే ఏమిటి? కాలంలోకి ప్రయాణించడం మనిషికి సాధ్యమా? అదే మనం ఇప్పుడు తెలుసుకుందాం.

October 10, 2020 at 4:55 PM
in Culture, Spiritual
Share on FacebookShare on TwitterShare on WhatsApp

అకస్మాత్తుగా మీ ఇంటి తలుపు ఎవరో తడతారు.. మీరు తలుపు తీయగానే ఓ వ్యక్తి లోపలికి వచ్చి ‘ఎలా ఉన్నావు మనవడా? ’అనంటే మీరేం చేస్తారు? ‘అలా ఆశ్చర్యపోమాకు.. నువ్వు నా ముని ముని ముని ముని మనవడివి లేవయ్యా..’ అనగానే మీరు అతడు పిచ్చోడనుకుని తరిమేస్తారు.

ఎన్.ఆర్. నంది రాసిన ‘సిగ్గు సిగ్గు’ నవల ఎవరైనా చదివి ఉంటే అందులో కొడుకు ముసలోడు, తండ్రి నవయవ్వనంతో ఉంటాడు.. ఇలాంటి అంశాలు నవలలుగా వచ్చినా, సినిమాలుగా వచ్చినా మనం చక్కగా ఎంజాయ్ చేసేస్తాం. నిజ జీవితంలో ఇలాంటి పాత్రలు తారసపడితే ఇందాక మన తాతగారికి పట్టిన గతే పడుతుంది.టైమ్ మెషీన్.. ఔను ‘ఆదిత్య 369’ సినిమాలో మీరు చూసిందే. నిజంగా ఇలాంటివి ఉంటాయా? దేనికైనా టైమ్ రావాలి? మన చేతిలో ఏమీ లేదు.. అంతా కాలమే చూసుకుంటుంది.

కారులో ప్రయాణిస్తారుగానీ కాలంలో ప్రయాణించడమేంటి అని మీరనుకోవచ్చు. మన టైమ్ బాగోకపోతే తాడే పామై కరుస్తుంది.. కాలంలో ప్రయాణించడం సాధ్యమేనా? టైమ్ మెషీన్ లాంటి యంత్రాల తయారీ సాధ్యమవుతుందా? వాటిలో కూర్చుని మనం భూతకాలానికీ, భవిష్యత్తుకూ వెళ్ళగలమా?.. దీని మీద అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది అసాధ్యం మాత్రం కాదని మన శాస్ర్తవేత్తలు అంటున్నారు.

ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం కాలంలో ప్రయాణం చేయడం సాధ్యమేనని అంటోంది. ఐన్ స్టీన్ సాపేక్ష సిద్దాంతంలో కాలంలో ప్రయాణానికి పనికొచ్చే అంశాలెన్నో ఉన్నాయి. అయితే వాటికీ మన పురాత హిందూ గ్రంథాలలో పేర్కొన్న అంశాలకూ దగ్గర పోలిక కనిపిస్తోంది. మన పురాణాల ప్రకారం మనుషుల 864 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక రోజుతో సమానమట. నాలుగు యుగాలను కలిపితే ఒక మహాయుగం ఏర్పడుతుంది. ఈ నాలుగు యుగాలు 71 సార్లు రిపీట్ అయితే ఒక మన్వంతరం అంటారు. అలాంటి 14 మన్వంతరాలు బ్రహ్మకు ఒక పగలు అంటారు. అంటే 432 మానవ సంవత్సరాలన్నమాట. పగలు, రాత్రి కలపాలి కాబట్టి ఈ 432 సంఖ్యను రెట్టింపు చేస్తే 864 సంవత్సరాలు బ్రహ్మకు ఒక రోజు అవుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నదేమిటంటే మనుషులకూ దేవుళ్లకూ కాలం ఒకేలా ఉండదు.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే ‘లేనిది ఎప్పటికీ ఉండదు.. ఉన్నది ఎక్కడికీ పోదు’ అని. దీన్ని సైన్సు ఏమంటుందంటే ఒక పదార్థాన్ని మనం సృష్టించలేం.. దాన్ని నాశనం చేయలేం అంటుంది. అప్పటిదాకా మనముందున్న పదార్థం మనముందు లేకపోయినా అది వేరే రూపంలోకి మారిపోతుందన్న మాట. ఈ విషయాన్ని వేల సంవత్సరాల క్రితమే మన మహర్షులు మనకు చెప్పారు. మనం ఈ భూమ్మీద నుంచి ఆకాశం వైపు చూస్తే ఎన్నో నక్షత్రాలు మన కంటికి కనిపిస్తాయి. నిజానికి అవి ఈ క్షణంలో ఉన్న వాటి రూపాలు కావు. ఈ క్షణంలో అవి అక్కడ ఉండకపోవచ్చు కూడా. కాలంతో ప్రయాణిస్తే గాని అవి ఎప్పటివో తెలియదు. ఇక్కడ కాలము, దూరము అనే సిద్ధాంతం పనిచేస్తుంది. వాటి అప్పటి కాంతి ప్రయాణిస్తూ వచ్చి ఇప్పుడు మన కంటికి చేరుతోంది. ఓసారి త్రేతాయుగంలో దేవలోకం మీదికి రాక్షసులు దండెత్తుతారు.

ఇతర లోకాల వీరుల సహాయాన్ని దేవేంద్రుడు కోరతాడు.  అప్పుడు భూలోకంలోని ముచికుందుడనే రాజు దేవలోకం వెళ్లి రాక్షసులతో పోరాడతాడు. ఏడాదిపాటు జరిగిన యుద్ధంలో రాక్షసులు ఓడిపోతారు. యుద్ధం ముగిశాక ఇంద్రుడు ముచికుందుడిని ‘ఏదైనా వరం కోరుకో’ అంటాడు. దానికి ముచికుందుడు తాను తిరిగి భూలోకానికి వెళ్లి తన కుటుంబాన్ని కలవాలనుకుంటున్నానంటాడు. దానికి ఇంద్రుడు ‘నువ్వు ఇక్కడ యుద్ధం చేసింది ఏడాదిపాటు. భూలోకంలో కొన్ని లక్షల సంవత్సరాలు గడిచి పోయాయి. కాబట్టి ఇప్పుడు నీవాళ్లెవరూ అక్కడ లేరు’ అంటాడు. వివిధ లోకాల్లో కాలం ఎలా వేరుగా ఉంటుందో తెలియడానికే ఈ కథ.

దీన్ని బట్టి చూస్తుంటే ఐన్ స్టీన్ చెప్పిన ‘టైం డైలేషన్’ (కాలం సాపేక్షత) అనేది పురాణాలలో కూడా ఉందని మనకు అర్థమవుతుంది. ఇవాళ మన శాస్త్రవేత్తలు, రోదసీ వ్యోమగాములు కొత్తగా కనుక్కొంటున్న శాస్త్రీయ విషయాల ప్రస్తావన పురాణాలలో కనిపించడం ఆశ్చర్యకరమే. కాలం అనేది పరబ్రహ్మ కంట్రోల్ లోనే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ విశ్వమంతా గడియారాలు ఒకేలా నడవవని న్యూటన్ భావించాడు. దాన్ని ఐన్ స్టీన్ నిరూపించాడు. ఈ భూమ్మీద ఉండే సెకను, అంగారక గ్రహం మీద ఉండే సెకను ఒకటి కాదని ఐన్ స్టీన్ తేల్చాడు.

యోగసాధనతో కాలంలోకి వెళ్లడం సాధ్యమేనని ‘యోగ వాసిష్టం’ లాంటి గ్రంథం చూస్తే తెలుస్తుంది. ఉపపరమాణు స్థాయిలో బహుళ విశ్వాలు, సమాంతర విశ్వాలు ఉంటాయని ‘యోగ వాశిష్టం’ చెబుతోంది. అనేక విశ్వాలుంటాయని కూడా మన శాస్ర్తవేత్తలు ఇప్పుడు నమ్ముతున్నారు. సత్యం తెలుసుకోడానికి మనం ఎక్కడ వెతికినా చివరికి సమాధానం మన పురాణాల్లోనే దొరకడం ఆశ్చర్యకరం. మనం టైమ్ మిషన్ గురించి ప్రారంభించి ఎక్కడెక్కడికో వెళుతున్నాం అని మీకు అనిపిస్తోంది కదా.. అక్కడికి కూడా వెళదాం.

వెళ్లేముందే విశ్వం ఎలా పుట్టిందో కూడా తెలుసుకుందాం. ఈ విశ్వం పుట్టడానికి అందరూ అంగీకరిస్తున్న సిద్దాంతం బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ విశ్వమంతా ఓ అగ్నిగోళంగా ఉండేదని, మహా విస్ఫోటనంతో ప్రారంభమై అన్ని దిశలకూ వ్యాపించిందని చెబుతారు. ఈ విస్పోటనం ద్వారానే కాలం అనేది కూడా పుట్టిందంటారు. దీనికి ముందు కాలం కూడా లేదట. అయితే బిగ్ బ్యాంగ్ విస్పోటనానికి కావల్సిన శక్తి అనేది ఎక్కడ నుండి వచ్చిందనేదే ప్రశ్న. దీనికి మన శాస్త్రవేత్తల దగ్గర కూడా సరైన సమాధానాలు లేవు.

1905లో ఐన్ స్టీన్ సాపేక్షిత సిద్దాంతాన్ని ప్రకటించారు. అందులో ఆయన పేర్కొన్ అంశాలేమిటంటే కాంతికంటే ఏదీ వేగంగా వెళ్లలేదు. కాంతి వేగం ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఏ వస్తువు కదులుతోందో, ఏది కదలడం లేదో చెప్పడం సాధ్యం కాదు. మనం ఎంత వేగంగా ప్రయాణిస్తే కాలం అంత తక్కువగా కదులుతుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కాంతి వేగంతో ప్రయాణిస్తే కాలం కదలిక నిలిచిపోతుంది. అంటే కాలం స్తంభించిపోతుందన్న మాట. ఇలా ఐన్ స్టీన్ తన సిద్ధాంతంతో పదార్థాన్నీ, శక్తీనీ కలిపాడు. పదార్థాన్ని శక్తిగా మార్చవచ్చు, శక్తిని పదార్థంగా మర్చావచ్చు అని అన్నాడు.

అదే ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ సిద్ధాంతాన్ని తయారుచేశాడు. ఈ రెండూ వేర్వేరు కాదని చెప్పడమే ఆయన ఉద్ధేశం. ఏకమేవం ద్వితీయం బ్రహ్మ అన్న ఉపనిషత్ వాక్యం కూడా అలాంటిదే. ఏ వస్తువైనా కాంతి వేగంతో ప్రయాణిస్తే అది కాంతి అనే శక్తిరూపం ధరిస్తుందన్నమాట. ఇది కూడా మన రుషులు రాసిన అంశంలానే ఉంది. కణాదుడు అనే రుషి వైశేషిక శాస్త్రం రాశాడు. అందులో కాలాన్ని ఓ ప్రాధమిక పదార్థంగా పేర్కొన్నాడు. ఆకాశం, కాలం, దిక్కు అనేవి అనంతాలు.. వీటికి అంతం లేదు. అందుకే ఈ అనంతకాల ప్రయాణంలో మనవారంటూ ఎవరూ ఉండరు.

పదార్థం, శక్తి అనే నాలెడ్డ్ 20వ శతాబ్దం నాటిది. కానీ కణాదుడు 2,600 సంవత్సరాల క్రితమే వీటి గురించి చెప్పాడు.ఇండియా : లివింగ్ విజ్ డమ్ సిరీస్ అనే పుస్తకం రాసిన రిచర్డ్ వాటర్ స్టోన్ ఈ సృష్టిస్థితిలయలన్నీ ఐన్ స్టీన్ ప్రతిపాదించిన E=mc2 తో పోలికలున్నాయని అంటారు. ‘ట్రావెల్స్ త్రూ సేక్రెడ్ ఇండియా’ గ్రంథ కర్త రోజెర్ హౌస్డెన్ ఏమంటారంటే ‘కాలం అనేది కాళికాదేవితో సంబంధం కలిగి ఉంది. ఆమె సంహారకారక స్వభావంలో కొంతవరకు అది కనిపిస్తుంది. ఐన్ స్టీన్ సమీకరణంలోని ‘శక్తి’ అంటే E అనేది భారతదేశంలోని పరాశక్తి రూపాలలో కనిపిస్తోందంటారు.

కాలంతో ప్రయాణించడం సాధ్యమా?..

ఈ విషయాలనే ఇప్పుడు తెలుసుకుందాం. ఐన్ స్టీన్ సిద్దాంతం మాత్రం కాలంతో ప్రయాణించవచ్చంటుంది. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలకు ఆయన పొరుగువాడైన కుర్ట్ గోడెల్ ఓ పరిష్కార మార్గాన్ని కూడా సూచించారు. టైమ్ మిషన్ నిర్మించాలంటే దానికి శక్తి కావాలి. మనం కారులో వాడటానికి శక్తి కోసం పెట్రోలు, డీజిల్ లాంటివి వాడుతుంటాం. కానీ దీనికి ఇది పనికి రాదు.. నక్షత్రాల శక్తిని నియంత్రించగలిగే సామర్థ్యం కావాలి. అలాకాని పక్షంలో ఓ అసాధారణ పదార్థాన్ని కనుక్కోవాలి. దీన్నే నెగిటివ్ ఎనర్జీ అంటున్నారు. రెండు సమాంతర ప్లేట్ల సహాయంతో అతి కొద్ది పరిమాణంలో ఈ నెగిటివ్ ఎనర్జీని శాస్త్రవేత్తలు సృష్టించగలిగారు. దీన్ని కాసిమిర్ ప్రభావం అంటున్నారు.

అయితే ఒక టైమ్ మెషీన్ పని చేయాలంటే భారీ పరిమాణంలో ఈ నెగటివ్ ఎనర్జీ కావాలి. మరి కొన్ని శతాబ్దాల దాకా అంత టెక్నాలజీ మనకు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రపంచంలోని ఇద్దరు భౌతిక శాస్ర్తవేత్తలు కాలంలోకి ప్రయాణంచడం సాధ్యమేనని చెబుతున్నారు. వీరిలో ఒకరు జపనీస్ అమెరికన్ శాస్త్రవేత్త మిఛియో కకు అయితే ఇంకొకరు మనందరికీ తెలిసిన స్టీఫెన్ హాకింగ్. విశ్వంలో మనం స్వేచ్ఛగా ముందుకు కదలొచ్చని కకు అంటున్నారు. కాబట్టి ఎవరైనా మన ఇంటి తలుపుకొట్టి మన ముని మనవణ్ణి అని చెబితే మీరు అతడ్ని తరిమేయొద్దు. కాలంలోకి ప్రయాణించడానికి ఐన్ స్టీన్ మనకు మరో మార్గాన్ని సూచించారు.

అవే బ్లాక్ హోల్స్.. ఈ మాట వినగానే బాబోయ్ అంటున్నారా.. వీటికి అంత భయపడాల్సిన పనిలేదు. నిజంగా ఈ కృష్ణబిలాలు మనల్ని మింగడానికే లేవు. వీటి లోపలికి ప్రయాణం చేస్తే అసలు రహస్యం తెలుస్తుందట. వీటిని టైమ్ మిషన్స్ గా మార్చుకోవచ్చంటున్నారు. ఐన్ స్టీన్ వాదనను స్టీఫెన్ హాకింగ్ కూడా సమర్థిస్తున్నారు. హాకింగ్ అభిప్రాయం ప్రకారం ఎవరైనా కాలంలో ప్రయాణించాలంటే దానికి తగ్గ వేగం కావాలి. అది ఎంత ఉండాలి అంటే ప్రస్తుతం అపోలో నౌక ప్రయాణించే వేగంకన్నా రెండు వేల రెట్టు అధికంగా ఉండాలట. అపోలో నౌక గంటకు 25 వేల మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనికి రెండు వేల రెట్టు అంటే ఎంత వేగమో మీరే ఊహించుకోండి. గతంలోకి వెళ్లాలంటే మనకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి.

వీటినే గ్రాండ్ ఫాదర్ పారడాక్స్ అంటారు. అంటే ఒక వ్యక్తి భూతకాలంలోకి ప్రయాణం చేసి అతడి తల్లిదండ్రులను చంపితే ఏమవుతుంది? ఇలాంటి ఆలోచనే మన శాస్త్రవేత్తలకు కూడా వచ్చేసింది. అలా జరిగితే ఆ వ్యక్తి పుట్టడానికి కూడా అవకాశం లేదు కదా. కానీ అతడు పుట్టాడు కాబట్టే వెనకటి కాలానికి వెళ్లగలిగాడు. మరి ఇదెలా సాధ్యం? అదే జరిగితే అతను తన గోతిని తనే తవ్వుకున్నట్టు కదా. సూర్య హీరోగా 24 సినిమా కూడా ఈ తరహాలోనే సాగుతుంది. దీనికి రష్యా శాస్త్రవేత్త నోవికోవ్ ఓ పరిష్కార మార్గాన్ని కూడా సూచించాడు. మనం కాలంలోకి ప్రయాణం చేస్తే మన ఫ్రీవిల్ కు కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. తన తల్లిదండ్రుల్ని చంపాలనే ఆ వ్యక్తి ప్రయత్నాన్ని ఏదో శక్తి అడ్డుకుంటుందట.

కాలంలోకి ప్రయాణిస్తే ఇంకా ఏం జరుగుతుంది?

ఇందాక మనం గ్రాండ్ ఫాదర్ పారడాక్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ట్విన్ పారడాక్స్ గురించి తెలుసుకుందాం. ఇద్దరు కవల పిల్లలు ఉన్నారనుకుందాం. వారిలో ఒకరు జెట్ విమానంలో అత్యంత వేగంగా అంతరిక్షంలోకి ప్రయాణించి ఈ భూమ్మీదకు వస్తే ఏంజరుగుతుందో తెలుసా? తన సోదరుడికంటే వయసులో అతను చిన్న వాడవుతాడట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే అతను వేగంగా అంతరిక్షంలోకి ప్రయాణించడం వల్ల అతడి శరీర వ్యవస్థలన్నీ నెమ్మదిగా పనిచేసే గడియారంలా మారిపోతాయట. అతడు ఎంత వేగంగా ప్రయాణిస్తాడో అతడి వయసు పెరగడం అంత తగ్గుతుందన్నమాట. కాంతి వేగంతో ప్రయాణిస్తే అతడి వయసు పెరగడం ఆగిపోతుంది.

ఇందాకటి నుంచి కాంతివేగం అనే మాటను మీరు వింటున్నారు. సెకనుకు దాదాపు మూడు లక్షల కిలో మీటర్ల వేగంతో కాంతి ప్రయాణిస్తుంది. ఒక వ్యక్తి వయసు 30 సంవత్సరాలు, అతడి తమ్ముడి వయసు 25 సంవత్సరాలు అనుకుందాం. పెద్దోడు ఓ ఇరవయ్యేళ్లు అంతరిక్షంలో ప్రయాణించి భూమ్మీదకు తిరిగివచ్చడనుకుందాం. పెద్దోడి వయసు 30 ఏళ్లే ఉంటుంది, చిన్నోడి వయసు మాత్రం 45 ఏళ్లు ఉంటుంది. ఇది నిజమేనని అంతరిక్షంలో ప్రయాణించే వ్యోమగాములు అంగీకరిస్తున్నారు. దీంతో ఐన్ స్టీన్ సిద్ధాంతానికి బలం చేకూరింది.

ఇదండీ మన టైమ్ మెషీన్ కథ. ఇది మన పురాణాల దగ్గర నుంచి ఉన్నదే.. ఇప్పుడు చెబుతున్నదీ ఇదే.. ఇప్పటికే ఈ మెషీన్ మన దగ్గర ఉంటే ఈ కరోనా వైరస్ అంతుచూసే వారమేమో. లేదా భవిష్యత్తులోకి ప్రయాణించి దీని వ్యాక్సిన్ గురించి తెలుసుకుని జనానికి అందించేవారిమేమో. ఇదంతా వింటుంటే ఉట్టికెగర లేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా మీకు అనిపిస్తోందా.. ఆ టైమ్ వస్తే మీరే తెలుసుకుంటారు. టైమ్ మెషీన్ కు సంబంధించిన సమగ్ర అంశాల కోసం ఈ యూట్యూబ్ లింక్ మీద క్లిక్ చేయండి.

– హేమసుందర్ పామర్తి

Tags: time machinetrinetram
Previous Post

‘కేస్‌ 99’ ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన బోయపాటి శ్రీను

Next Post

హిట్ కొట్టు.. పెళ్లి మాట ఎత్తు.. ఇదీ అఖిల్ ప్రేమమ్

Related Posts

ఆ ఎమ్మెల్యే కరుణిస్తేనే శివయ్య దర్శనం! దైవ దర్శనాలపై కూడా రాజకీయాలేనా?

by కృష్
March 2, 2022 10:00 am

గుడి, బడికి తేడా లేకపోతే ఎలా? ఈ మధ్య జగన్ పార్టీకి అధికారం...

శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు!

by కృష్
March 1, 2022 7:39 pm

భక్తి భావంతో పరిఢవిల్లుతున్న శివాలయాలు.. కోవిడ్ మూడు వేవ్ లను దాటుకుని ఆరోగ్యకర...

శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

by Leo Editor
February 22, 2022 3:36 pm

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి యగశాల ప్రవేశం చేసి మహాశివరాత్రి...

టాపిక్ డైవర్షన్సకే తెరపైకి చింతామణి నాటకం..! కళాకారుల పొట్టగొట్టె ప్రయత్నాలు ఆపండి!!

by కృష్
January 21, 2022 5:08 pm

ఆలయాల విధ్వంసం, అన్యమత ప్రచారం, సనాతనంపై చిన్నచూపు.. జగన్ రెడ్డి రెండునరేళ్ల పాలనలో...

తిరుమల శ్రీవారి మహాద్వారం వద్ద భక్తుల ఆందోళన!

by కృష్
January 14, 2022 12:30 am

వీఐపీ సేవల్లో మునిగిపోతే.. సామాన్య భక్తుల పరిస్థితేంటి? ముక్కొటి ఏకాదశి పర్వదినాన ఉత్తర...

అర్చకులను ఉద్యోగాలుగా మారుస్తారా? ఇదేక్కడి సాంప్రదాయం??

by కృష్
December 24, 2021 10:30 am

కోర్టును ఆశ్రయించేందుకు ప్రయత్నాలు ..! తిరుమలలో పాలక మండలి, ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు...

‘రామ‌ప్ప‌’కు గుర్తింపు.. కిష‌న్ రెడ్డి ప్ర‌భావ‌మేనా?

by Leo Editor
July 25, 2021 7:45 pm

తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్ర‌ముఖ ఆల‌యాలు శిల్ప క‌ళా నైపుణ్యానికి ప్ర‌తీక‌గానే చెప్పుకోవాలి....

వైరస్ లను సైతం పారిజాతం నివారిస్తుందా?

by హేమసుందర్
April 30, 2021 11:50 am

పారిజాతం - ఎంత అందమైన పేరిది. ఓ పుష్పానికి ఇంత అందమైన పేరు...

వేంకటేశుడి అవతార విశేషాలు

by హేమసుందర్
March 5, 2021 5:34 pm

శ్రీ వేంకటేశ్వరుడిని కలియుగ దైవం అని ఎందుకన్నారు? అంటే వేంకటేశ్వరుడు కలియుగానికి చెందిన...

మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘం?

by హేమసుందర్
February 25, 2021 5:42 pm

మాఘ పౌర్ణమి స్నానం ఎందుకు అమోఘమో తెలుసుకుందాం. తెలుగు నెలల్లో మాఘమాసంకు ఓ...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

‘Rangasthalam’ actress Anasuya Bharadwaj looks charming in a blue half-saree!!!

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

Dimple Hayathi stuns in a sheer top in these new captivating photoshoots

Captivating pictures of Aabha Paul are sweeping the internet

Sonal Chauhan hottest bikini photos

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

ఈ దిలీప్ ‘వంక‌ర’ చేష్ఠల వ్యూహం ఇదేనా?

Stunning Hot beauty Ketika Sharma Latest Photos

ముఖ్య కథనాలు

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

లిక్కర్ కేసులో బిగ్‌ అప్డేట్‌.. మాస్టర్ మైండ్‌కు సుప్రీం షాక్..!

మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఉగాదికి మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్!

బిల్‌గేట్స్‌నీ వదలలేదు.. ఏపీకి రాకముందే విష ప్రచారం..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

చంద్రబాబు గొప్పతనం… రేవంత్‌ సాక్షిగా మెగాస్టార్‌ లీక్‌..

యలహంక ప్యాలెస్‌ షర్మిలదే.. జగన్ కి సంబంధం లేదు.. విజయమ్మ షాకింగ్‌ కామెంట్స్..

ఏపీలో జాబ్ క్యాలెండర్ వచ్చేసింది.. నిరుద్యోగులకి పండగ..!

జగన్‌ తప్పు చేశాడా..? చిన జీయర్‌ కామెంట్స్‌పై వైసీపీలో డైలమా..!

విజయా డెయిరీని ముంచేశాడు.. జగన్ మరో ఘనత.!

లడ్డూ కల్తీ స్కామ్‌ కాదా..? అంతకు మించిన కుట్ర ఉందా..?

ఏపీలో మరో ఉక్కు పరిశ్రమ.. శ్రీ సిటీలో జపాన్‌ కంపెనీ ఎలక్ట్రికల్ స్టీల్‌ ప్లాంట్‌..

అధికారంలోకి వస్తే రక్తంతో హోలీ..జగన్‌ పర్యటనలో అరాచకం..!

జగన్‌ టెంపుల్‌ రన్‌.. భార్య భారతి మిస్సింగ్‌..?

పునర్విక కోసం నారా లోకేష్‌..రూ.6 కోట్ల భారీ సాయం..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist