అవగాహాన లేని వ్యక్తి ముఖ్యమంత్రి పరిపాలన సాగిస్తే ఇలాగే ఉంటుందని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ చర్చల ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ అవగాహనాలేమితో రాష్ట్రానికి నష్టం వాటిల్లడంతోపాటు, రాష్ట్రాన్ని జాతీయ, అంతర్జాతీయంగా అప్రతిష్ఠపాలు చేస్తుందని తెలియజేశారు. ప్రభుత్వ విధానాలు అర్ధం పర్ధం లేకుండా పోతున్నాయని చెప్పుకొచ్చారు.
దశ మారిన ‘దిశ చట్టం’
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపకల్పన చేసిన వాటిలో దిశ చట్టం ఒకటి. దిశ చట్టం పేరుతో ఏపీ ప్రభత్వం ఏర్పాటుచేసిన చట్టాన్ని కేంద్రం తిప్పి పంపడంతో, అందులో భారీ స్థాయిలో మార్పులు చేపట్టింది. 21 రోజుల్లో విచారణ, మరణ శిక్ష వంటి కఠినమైన చట్టాలు రూపొందించాం అని డప్పుకొట్టిన రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు కేంద్రం బ్రేకులు వేసింది. ప్రత్యేక కోర్టులో విచారణ చేయాలనే నియమాన్ని మాత్రం తీసేయకుండా వదిలిపెట్టింది. నిర్భయ చట్టం లోని విధానాల ప్రకారం అములయ్యేలా మార్పలు చేపట్టారు. ఆమాత్రం దానికి కొత్త చట్టం పేరుతో హడావిడి చేశారని చంద్రబాబు పేర్కోన్నారు. చట్టాల గురించి అవగాహాన లేని వ్యక్తి కొత్త చట్టాల రూపకల్పన చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ‘దిశ చట్టం’ ఒక ఉదాహరణ మాత్రమే తెలియజేశారు.
Also Read ;- పదే పదే ‘మేం భయపడిపోం’ అనే మాట.. జగన్ భయానికి ఇదే సాక్ష్యమా..!
చెత్త పైన కూడా పన్ను వేస్తారా?
రాష్ట్ర ప్రజలు ఉపాధి కోల్పోయి అల్లాడుతున్న ఇలాంటి సమయంలో ఉద్యోగ కల్పన గురించి ఆలోచన చేయడం మానేసి, ప్రభుత్వ ఆదాయం పేరుతో పన్నులు వేస్తుందని ప్రభుత్వ విధానాల్ని తప్పుపట్టారు. ఇంటి పన్ను, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల… ఇలా ఒక్కటేమిటి అన్నింటినీ పెంచుకుంటూ పోతున్నారు. అసలే కరోనాతో అల్లాడుతున్న ప్రజలకు, జగన్ సర్కార్ పన్నుల భారం వేయడం దారుణమని చెప్పుకొచ్చారు. ఇంటి నుండి వచ్చే చెత్తకు కూడా పన్ను వేస్తారా అంటూ ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టారు. ఇవి సరిపోనట్టు అస్తవ్యస్తమైన ఇసుక విధానంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని చెప్పారు. వీటికి తోడు ప్రతిపక్షాలపై దాడులు, కక్ష సాధింపు చర్యలకు అడ్డులేకుండా పోతుంది. వారిలా మేమేన్నడు ప్రవర్తించలేదన్నారు. సామాజిక న్యాయం పాటిస్తూ, ప్రభుత్వ ఫలలాలను పార్టీలకతీతంగా ప్రజలకు అందజేశామని గత ప్రభుత్వ విధానాన్ని గుర్తుచేశారు.
సమాధానాలు చెప్పలేక 5 రోజుల సస్పెన్షన్
టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ను చంద్రబాబు తప్పుబట్టారు. ప్రతిపక్షాలను ఎదుర్కోలేక, వారడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే ఇలాంటి సస్పెండ్ లాంటి చర్యలకు పాల్పడినట్టు చెప్పుకొచ్చారు. పంటల బీమా లెక్కల్లో కూడా అన్ని అసత్యాలే ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం కట్టింది కేవలం 26 లక్షలు, కానీ ప్రభుత్వం 50 లక్షలుగా చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనితో పాటు, ఎన్నికలకు ముందు జగన్ చెప్పిన వీడియోలను ప్రదర్శించి ప్రజలకు జరుగుతున్న మోసాలను వీడియోల సాక్షిగా చెప్పుకొచ్చారు చంద్రబాబు.
Must Read ;- జగన్ ‘సోషల్’ గా దిగజారాడా.. నేతల బాటలోనే క్యాడర్











