సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేయడంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసుపై ఇవాళ విచారణ జరిగింది. ఏబీకి పోస్టింగ్ ఇవ్వకుండా జాప్యం చేయడంపై ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ఏబీపై ఎప్పటిలోగా విచారణ పూర్తి చేస్తారని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులను ధర్మాసనం ప్రశ్నించింది. కాగా ఏబీ వెంకటేశ్వరరావుపై విచారణ పూర్తి చేయడానికి 6 నెలల సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు.
త్వరగా విచారణ పూర్తి చేయండి
ఏబీ వెంకటేశ్వరరావు అవినీతి కేసుపై రోజువారీ విచారణ చేపట్టి ఏప్రిల్ 30 కల్లా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మే 3వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. జస్టిస్ ఎ.ఎం.ఖాన్ విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది.
Must Read ;- ఏబీవీకి మరో మూడు వారాల ఊరట











