తమిళ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ తెల్లవారు జామున ఆయన అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. రొటీన్ వైద్య పరీక్షల కోసమే ఆయన ఆస్పత్రిలో చేరినట్టు చెబుతున్నా కోవిడ్ లక్షణాలతోనే ఆస్పత్రిలో చేరినట్టు అంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు.
అయితే గత ఏడాది సెప్టెంబరులో ఆయన కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఈ 9 నెలలు ఆయనకు ఇమ్యూనిటీ ఉంటుందని కాబట్టి కోవిడ్ కు అవకాశం లేదని మరికొందరు అంటున్నారు. ఆ తర్వాత ఆయన భార్య కూడా కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. రెండ్రోజుల్లో ఆయనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావచ్చని డీఎండీకే వర్గాలు అంటున్నాయి. ఇటీవల ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు.
Must Read ;- కరోనాతో తమిళ హాస్యనటుడు పాండు కన్నుమూత











