ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్ కేసులో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మరోసారి సీఐడి విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విచారణ పేరుతో సీఐడీ విలువైన సమయాన్ని వేస్ట్ చేస్తుందని ఆరోపించారు. విచారణ పేరుతో గంటలతరబడి కూర్చోబెడితే అధికారులకు ఏం వస్తుందని దేవినేని ప్రశ్నించారు. ధాన్యం పెద్ద ఎత్తున దోపీడి జరుగుతుంటే, సీఎం ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం అవసరమైతే జైలుకు కూడా వెళ్తానని అన్నారు. అక్రమ అరెస్టులతో జగన్ ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతుందని దేవినేని అన్నారు.
Must Read ;- చంద్రబాబు పేరు చెప్పు, నిన్ను వదిలేస్తాం : సీఐడి అధికారులు ఒత్తిడి