తెలుగుదేశం నాయకురాలు, చిత్తూరు నుంచి ఎమ్మెల్యేగా గతంలో సేవలందించిన డికె సత్యప్రభ కన్నుమూశారు.
ఆమె ప్రస్తుతం టిడిపి జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. సత్యప్రభ అనారోగ్యంతో చికిత్స పొందుతూ బెంగళూరు వైదేహి అసుపత్రిలో మృతి చెందారు. ఇటీవల ఆమె కరోనా బారిన పడి కోలుకున్నారు. కొన్నాళ్ల తర్వాత అనారోగ్యం మళ్లీ తిరగబెట్టింది. మాజీ ఎంపీ, టిటిడి చైర్మన్ గా పనిచేసిన డీకే ఆదికేశవులుకు సత్యప్రభ సతీమణి.. డీకే ఆదికేశవులు.2013లోనే మరణించారు.
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరపున రాజంపేట లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి సత్యప్రభ ఓడిపోయారు.
ప్రజాసేవలో మంచి నాయకురాలిగా..
డికె ఆదికేశవులు, సత్యప్రభ కుటుంబానికి ప్రజల్లో మంచి పేరు ఉంది. డికె ఆదికేశవులు వ్యాపారరంగంలో ప్రముఖులు. అలాగే సత్యసాయిబాబా భక్తులుగా కూడా అందరికీ పరిచితులు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండగా చిత్తూరు ఎంపీగా పనిచేాశారు. ఆయన మరణానంతరం రాజకీయ వారసత్వం భార్య సత్యప్రభకు వచ్చింది.
ప్రజల పట్ల కమిటెడ్ గా పనిచేసే నాయకురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. ఏదైనా ప్రజల అవసరం కోసం ఆమె స్వయంగా వినతిపత్రాలు పట్టుకుని.. మంత్రుల వద్దకు పదేపదే తిరిగి.. వారు పని పూర్తి చేసే వరకు తన సొంత ఖర్చులతో తిరుగుతూ పనిచేస్తుంటారు.
Also Read ;- తమ్మినేని కోరిక నెరవేరేనా..?