బలహీనతతో సతమతమౌతున్న పంక పార్టీ!
రాజకీయంగా దిగజారి పంక పార్టీ సతమతమౌతోంది. నవరత్నాలు నలువిధాలుగా రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టివేశాయని గ్రహించిన అధికారపార్టీ .. మిని లోకల్ వార్లోనైనా పరువు దక్కించుకునేందుకు చేసిన దాష్టికాలు, దుస్సాహసాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తునే ఉన్నారు. రాష్ట్రంలో మిగిలి ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల 1న నోటిఫికేషన్ విడుదల చేసింది ఎస్ఈసీ. నెల్లూరు కార్పోరేషన్ తోపాటు 13 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు షేడ్యూల్ ను ప్రకటించింది. నాటి నుంచి నేటి వరకు రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చింది అధికారపార్టీ. నెల్లూరు కార్పోరేషన్ తోపాటు బుచ్చిరెడ్డిపాలెం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, దర్శి, కుప్పం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు సోమవారం ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గత రెండేళ్లు నుంచి క్రమంగా ప్రజాస్వామ్యంలో ప్రభావం క్షీణిస్తున్న అధికారపార్టీ ఈ లోకల్ మిని ఎలక్షన్ లో ఏలాగైనా నెగ్గాలని కుట్రలు పన్నింది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో పోటీచేస్తే ఖచ్చితంగా ఓడిపోతామని తెలిసి పోలీసులను, ఎన్నికల అధికారులను అడ్డంపెట్టుకుని ప్రతిపక్ష టీడీపీపై దాడులకు తెగపడింది.
దాడులను ప్రతిఘటించి .. దొంగ ఓట్లను తిప్పికొట్టి!
లోకల్ మినివార్ లో అధికారపార్టీ నుంచి ఎదురౌతున్న దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ. అధికార మదంతో అడుగడుగునా పోలీసు చర్యలకు పాల్పడుతూ .. ఎన్నికల్లో ఏకగ్రీవాలకు తెరతీశారు. ఏకగీవ్రాలను ఒప్పుకోని టీడీపీ నాయకులపై కేసులు బనాయించి వేధింపులకు గురిచేశారు. నామినేషన్ వేయాలని వస్తే నామ పత్రాన్ని చింపేసి, దిక్కున్నచోట చెప్పుకో అని హేళన చేశారు. అవి కూడా దాటుకుని వచ్చిన టీడీపీ శ్రేణులను కొన్నిచోట్ల ఫోర్జరీ సంతకాలు పెట్టిన మరి ఎన్నికల అధికారులతో నామినేషన్ ను విత్ డ్రా చేయించారు. కుప్పం, నెల్లూరు, గురజాల, దాచేపల్లి వంటి అనేక ప్రాంతాల్లో టీడీపీ ఎన్నికల ప్రచారానికి అంక్షలు పెట్టింది. నాయకులను గృహ నిర్భందం చేసి, నీచరాజకీయాలకు తెరతీసింది. ఎన్ని అరాచకాలు సృష్టించిన సమర్థవంతంగా ప్రతిఘటిస్తూ టీడీపీ శ్రేణులు ముందుకు సాగాయి. ఎన్నికల బరిలో నిలుచుని అధికారపార్టీ దాష్టికాన్ని ఎండగట్టింది.
టీడీపీ నెత్తిన పాలుపోసి .. నైతిక విజయాన్ని కట్టబెట్టి!
అధికార వైసీపీకీ ఎన్నికల్లో వీరికంటూ ఒక వ్యూహం ఏమీ ఉండదు కాబోలు. బాహుబలిలో కాలకేయుడి టీం మాదిరిగా తలపిస్తుంటాయి చర్యలు. అధికారం ఉంది కదా .. ఇష్టారాజ్యంగా వాడటం మొదలుపెడతారు. నెల్లూరు తోపాటు తక్కిన మున్సిపాలిటీల్లో అధికారపార్టీ అమలు చేసిన అరాచకం హద్దుమీరింది. అలా చేష్టలుడిగిన వైసీపీ రాజకీయం నేడు టీడీపీ నెత్తిన పాలుపోసినట్లైంది. రాజకీయంగా టీడీపీని, వ్యూహాత్మకంగా చంద్రబాబును ఎదుర్కొనడం చేతకాక అడ్డదారులన్నీ తొక్కింది. అడ్డగోలు ఆంక్షాలతో అనదొక్కలని చూసింది. ఆ నిరకుశత్వమే నేడు మిని లోకల్ వార్ లో టీడీపీకి నైతిక విజయాన్ని కట్టబెట్టింది. గెలిచే నమ్మకం లేకే ప్రతిపక్షాలను ఎదుర్కొలేకే దొంగ ఓట్లతో దాడులకు పాల్పడింది అధికారపార్టీ. దీనిని రాష్ట్ర ప్రజలందురూ గమనిస్తేనే ఉన్నారు. అధికారపార్టీ అసమర్థతను ఎండగడుతున్నారు. అయితే టీడీపీ నైతిక విజయానికి మచ్చుకగా కర్నూల్ జిల్లా నంద్యాల మండల భీమవరం సంఘటనను తీసుకోవచ్చు. భీమవరం 4వ వార్డులో వైసీపీ గట్టి షాక్ తగలింది. అధికారపార్టీ అభ్యర్థి నాగపుల్లారెడ్డి పై టీడీపీ అభ్యర్థి జనార్థన్ విజయం సాధించారు. అలానే కృష్ణగిరి మండలం లక్కసాగరంలో టీడీపీ రెబల్ అభ్యర్థి 858 ఓట్ల మెజారిటీ సాధిచారు. ఇలా టీడీపీ రాష్ట్రంలో నైతిక విజయం సాధిస్తూ మనోదైర్యంతో పురోగమిస్తోంది.
Must Read ;- అధికార ‘దొంగలు’ దొరికారు!











