Ten Young Women Killed In Ramya Style :
ఆంధ్రప్రదేశ్ లో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందన్న వాదనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో యువతులు ఎక్కడో ఒక చోట మానవ మృగాల చేతిలో చిక్కుకుని బలి అవుతున్నా.. జగన్ ప్రభుత్వం యువతుల ప్రాణాలకు రక్షణ కల్పించలేక పోతోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. మహిళపై దాడులు జరిగితే గన్ను కన్నా ముందు జగన్ వచ్చి మహిళలను కాపాడుతారని ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు చెప్పిన మాటలన్నీ ఒట్టి ప్రగల్భాలేనని తేలిపోయిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. అధికారం కోసం ఎన్నెన్నో మాటలు చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంచక్కా.. సీఎం కుర్చీని ఎంజాయ్ చేస్తూ.. రాష్ట్రంలో లెక్కలేనంత మంది మహిళలు వేధింపులకు గురి అవుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చట్టబద్ధత లేని దిశా చట్టం
మహిళ రక్షణ కోసం దిశా చట్టం తెచ్చామని, మహిళలపై దాడులు జరిపిన వారిని ఈ చట్టంతో కఠినంగా శిక్షిస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ తీరా చూస్తే ఆ చట్టానికి చట్టబద్ధత లేదని, పార్లమెంటు కూడా ఆ చట్టాన్ని రెండు సార్లు వెనక్కి పంపించింది. అయినా కూడా దిశా చట్టం అంటూ దిశా పోలీస్ స్టేషన్ లు, దిశా కంట్రోల్ రూమ్ లు, దిశా ప్రత్యేక న్యాయస్థానాలు, దిశా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, దిశా ఫోరెన్సిక్ ల్యాబులు, దిశా అప్ లు అంటూ జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గడచిన రెండేళ్ల జగన్ జమానాలో చిత్తూరు జిల్లాలో గాయత్రి, ఒంగోలులో దివ్యంగురాలు భువనేశ్వరి, ధర్మవరంలో జాతీయ స్థాయి జూనియర్స్ హాకీ ప్లేయర్ స్నేహాలత, విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని, విశాఖలో ఇంటర్మీడియట్ విద్యార్థిని వరలక్ష్మి, చిత్తూరులో సుష్మిత, విజయవాడలో తస్నిమ్ ఫాతిమా, గూడూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని తేజస్విని నరసరావుపేట లో బీఎస్సీ విద్యార్థిని అనూష, నిన్న గుంటూరులో ఇంజనీరింగ్ విద్యార్థిని రమ్య.. ఇలా పది మంది యువతులు మృగాళ్ల చేతిలో అతి కిరాతకంగా బలి అయ్యారు.
Ten Young Women Killed In Ramya Style
ప్రభుత్వ అసమర్థత వల్లే…
ఇలా రెండేళ్లలోనే పది మంది యువతులు మృగాళ్ల చేతిలో బలి అవ్వడానికి జగన్ ప్రభుత్వ అసమర్థతే కారణమని ప్రజలు భావిస్తున్నారు. మహిళలకు జగన్ ప్రభుత్వంలో రక్షణ కల్పిస్తామన్న మాటలు ప్రచార ఆర్భాటాలకు మాత్రేమే తప్ప ఆచరణలో మాత్రం కనపడడం లేదనడానికి జరిగిన సంఘటనలే సాక్ష్యమని చెప్పక తప్పదు. ఇకనైనా జగన్ సర్కారు ప్రచార ఆర్భాటాలతను మాని రాష్ట్రంలో మహిళల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. లేని పక్షంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ అన్న మాటే మరిచిపోవాల్సి వస్తోందన్న వాదనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
Must Read ;- లోకేశ్ తొలి అరెస్ట్ ఏపీని షేక్ చేసింది!