ఎంపీ ల్యాండ్స్ నిధులు చర్చి నిర్మాణాలాకా? ఇదేక్కడ చోద్యం??
ఎంపీ నందిగం సురేష్ … బాపట్ల ఎంపీ. ప్రస్తుతం ఈయన కోటాల్లో కేంద్రంలో విడుదల చేసిన ఎంపీ ల్యాండ్స్ నిధులను నియోజకవర్గాల అభివృద్ధికి ఖర్చుచేయకుండా చర్చి నిర్మాణానికి మళ్లించి ఘనత సాధించిన గొప్ప ప్రజాప్రతినిధి. నియోజకవర్గాల అభివృద్ధికి ఖర్చుచేయావల్సిన నిధులను ఇష్టారాజ్యంగా చర్చిల నిర్మాణాలకు కేటాయించడం ఏమిటని కేంద్ర ప్రశ్నిస్తోంది. ఇదే అంశంపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖ రాసి, వివరణ గా అడుగుగా .. నేటికి సమాధానం చెప్పలేదని కేంద్ర గణాంకాలు, ప్రణాళిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రమ్య అసహనం వ్యక్తం చేశారు. గతంలో అక్షరాల రూ.40 లక్షలను ఎంపీ చర్చిల నిర్మాణాలను వాడారని ఆరోపణలు రావడంతో ..ప్రతి ఏటా ఎంపీలకు కేంద్రం ఇచ్చే నిధులను దేనిదేనికి వాడారు, చర్చికి నిర్మాణాలకు నిధులను ఖర్చు చేసిన మాట వాస్తవామా? అని కేంద్రం పలుమార్లు లేఖ రాసిని, జగన్ రెడ్డి ప్రభుత్వం నుంచి వచ్చే అన్సర్ మాత్రం పిన్ డ్రాప్ సైలెంట్. మొత్తంగా నందిగం సురేష్ తన ఎంపీల్యాడ్స్ నుంచి రూ.86 లక్షలను ఖర్చు చేశారని, ఇదే తరహాలో ఏపీ వ్యాప్తంగా ఎంపీ నిధులను చర్చిలకు కేటాయించారని ఆ పార్టీ ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రధాన మంత్రి కార్యాలయం రాష్ట్ర ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. ఇది నిజం కాబట్టే ప్రభుత్వాధికారులు ఈ విషయంపై పెద్దగా స్పందించడంలేదని విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.
Must Read ;- ఏపీ ఈఎస్ఐ కు వైద్య పరికరాలు నిలిపివేస్తున్నాం..!










