The Hundred – England Cricket Board Introduces New Format In Cricket :
క్రికెట్ అంటేనే ఒక రకమైన థ్రిల్ ను ఇచ్చే గేమ్. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ క్రికెట్ ను ఇష్టపడతారు. ప్రపంచంలో ఏ ఆటకు లేని ఫ్యాన్స్.. ఒక్క క్రికెట్ కే ఉన్నారు. అందుకే దశాబ్దాల తరబడి అలరిస్తోంది. ఒకప్పుడు టెస్టులు, వన్డేలకు పరిమితమైన క్రికెట్.. ఆతర్వాత టీ20, ఐపీఎల్ అంటూ కొత్త పుంతలు తొక్కింది. తాజాగా మరో కొత్త ఫార్మాట్ రానుంది. అదే ‘ది 100’ టోర్నీ
ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇప్పుడు ‘ది 100‘ పేరిట సరికొత్త ఫార్మాట్ ను పరిచయం చేస్తోంది. ఇందులో ఓ జట్టు 100 బంతులు ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ లో ‘ది 100’ టోర్నీ జరగనుంది. ఇందుకోసం 8 పురుషుల జట్లు, 8 మహిళల జట్లను ఎంపిక చేశారు. దీనికి సంబంధించి నియమనింధనలను కూడా ఇంగ్లాడ్ క్రికెట్ బోర్డు తయారు చేసింది. దీంతో క్రికెట్ అభిమానులకు కొత్త ఫార్మాట్ ఎలా ఉండబోతోందా అనే ఆసక్తి మరింత పెరిగిపోయింది.
ఒక ఓవర్ కు 6 బంతులుంటాయి. కానీ, ‘ది 100’ ఫార్మాట్లో మాత్రం ఓవర్లకు బదులు సెట్లు ఉంటాయి. ఒక సెట్ అంటే 5 బంతులు. ఒక బౌలర్ ఒకేసారి రెండు సెట్లు వేయాల్సి ఉంటుంది. తొలి 25 బంతులకు పవర్ ప్లే వర్తిస్తుంది. నాకౌట్ మ్యాచ్ ల్లో టై అయితే, ఒక్కో జట్టు ఐదేసి బంతులు ఆడాల్సి ఉంటుంది. గ్రూప్ స్టేజ్‌లో టాప్‌లో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. వర్షం వల్ల మ్యాచ్‌లకు అంతరాయం ఏర్పడితే కొత్త డీఎల్ఎస్ పద్ధతిని అమలుచేయనున్నారు. ఒకవేళ జట్టు స్లోగా బౌలింగ్ చేస్తుందనుకుంటే అంపైర్‌కే పెనాల్టీ విధించే హక్కు ఉంటుంది. ఈ టోర్నీ జూలై 21 నుంచి జరగనున్నట్టు తెలుస్తోంది.
Must Read ;- మిథాలీ ఘనత : ఇండియా రికార్డును బీట్ చేయడం కష్టమే!