పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేయడానికి ఓకే చెప్పారు. వకీల్ సాబ్ షూటింగ్ ఇంకా పూర్తి చేయాల్సివుంది. అయితే.. పవన్ కోసం డైరెక్టర్స్ వెయిటింగ్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలి అనుకుంటున్నారట. ప్రభాస్ తో వర్షం, మహేష్ బాబుతో ఒక్కడు, సిద్ధార్ధ్ తో నువ్వొస్తానంటే నేనొద్దంటానా.. ఇలా బ్లాక్ బస్టర్ మూవీస్ అందించారు. ఆతర్వాత కెరీర్ లో వరుసగా ఫ్లాపులు రావడంతో వెనకబడ్డారు. ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా ‘డర్టీ హరి’ అనే సినిమా చేశారు. ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ చేస్తున్నారు.
ఈ మూవీ ట్రైలర్ చూసి ఇలా ఉందేంటి అనుకుంటారు. అదే సినిమా చూసిన తర్వాత ఇందులో మంచి ఫీల్ ఉంది అని ఖచ్చితంగా చెబుతారు. ఈ సినిమా మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా సక్సస్ అవుతుంది. మళ్లీ పూర్వ వైభవం వస్తుందనే థీమాతో ఉన్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే.. సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై మళ్లీ సినిమాలు తీస్తాను అంటున్నారు ఎంఎస్ రాజు. అంతే కాకుండా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కథ చెబుతాను అని చెప్పారు.
ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని వుంది. ఆయనకు కథ చెబుతాను. ఆ కథ ఆయనకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు కానీ.. కథ మాత్రం చెబుతాను అంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, సాగర్ చంద్రలతో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. అఫిషియల్ గా ప్రకటించారు. వీళ్ల సినిమాలను పూర్తి చేయడానికి చాలా టైమ్ పడుతుంది. మరి.. ఎం.ఎస్.రాజు కూడా కథతో మెప్పిస్తే.. ఈయనకు కూడా పవన్ ఓకే అంటే.. ఈ సినిమా ఎప్పటికి సెట్స్ పైకి వెళుతుందో.?
Must Read ;- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసులన్నా క్రేజే?