యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్నిప్రముఖ నిర్మాణ సంస్థలు హరిక అండ్ హసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన వర్క్ లో త్రివిక్రమ్ బిజీగా ఉన్నారు. ఇందులో నటించే హీరోయిన్స్ అంటూ బాలీవుడ్ తారల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి కానీ.. హీరోయిన్స్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ యాక్షన్ స్టోరీ రెడీ చేసారట. ఆ కథ విని ఎన్టీఆర్ స్టోరీ బాగానే ఉంది కానీ.. ఆర్ఆర్ఆర్ యాక్షన్ మూవీ కాబట్టి వెంటనే యాక్షన్ మూవీ చేస్తే బాగోదు. అందుకే ఫ్యామిలీ స్టోరీ రెడీ చేయమని చెప్పారట. ఇంట్రస్టింగ్ గా ఉండే ఫ్యామిలీ స్టోరీ లైన్ చెప్పగా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీంతో యాక్షన్ స్టోరీ పక్కనపెట్టి ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టోరీ రెడీ చేస్తున్నారట.
అయితే…ఎన్టీఆర్ కోసం రెడీ చేసిన యాక్షన్ స్టోరీతోనే రామ్ చరణ్ తో సినిమా చేయాలి అనుకుంటున్నాడని తెలిసింది. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, పవన్ కళ్యాణ్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించాలి అనుకుంటున్నాయని సమాచారం. ఇది పాన్ ఇండియా స్టోరీ అట. ఈ సినిమానే తన తొలి పాన్ ఇండియా మూవీ అని త్రివిక్రమ్ ఫిక్స్ అయ్యారట.
Must Read ;- ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తున్నారా.?