‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి.. డెబ్యూ మూవీ ఇంకా విడుదల కాకుండానే.. పలు చిత్రాల్లో కథానాయికగా ఎంపికై.. అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాకా అమ్మడి దూకుడు ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె బాటలోనే మరో సుందరి .. తొలి చిత్రం విడుదల కాకుండానే .. పెద్ద సినిమాల్లో ఆఫర్స్ అందుకుంటూ అందరికీ షాకిస్తోంది. ఆమె పేరు మీనాక్షి చౌదరి.
సుశాంత్ హీరోగా నటిస్తోన్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్ లోకి కథానాయికగా ఎంట్రీ ఇవ్వనుంది మీనాక్షి చౌదరి. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే .. రవితేజ ‘ఖిలాడీ’ లో కూడా కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది. అలాగే ఇప్పుడు మరో సినిమా లో కూడా మీనాక్షి ఓ బ్రహ్మాండమైన ఆఫర్ అందుకుంది. ఆ సినిమా పేరు హిట్ 2
బిఫోర్ లాస్టియర్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హిట్. ఈ మూవీతో సాలిడ్ హిట్ కొట్టాడు అతడు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ను మాత్రం అడివి శేష్ తో ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత నాని. రీసెంట్ గా ఈ సినిమా అనౌన్స్ మెంట్ జరుపుకుంది. త్వరలోనే హిట్ 2 సెట్స్ మీదకు వెళ్ళేందుకు సిద్ధమవుతోంది. ఇందులో మీనాక్షి చౌదరి ఓ వెరైటీ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. శైలేజ్ కొలను దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా మొదటి భాగాన్ని మించి ఉత్కంఠభరితమైన కథతో తెరకెక్కుతోంది. మరి మీనాక్షి చౌదరి కూడా కృతి శెట్టి స్థాయిలో పేరు తెచ్చుకుంటుందేమో చూడాలి.
Must Read ;- తెలంగాణా యాక్సెంట్ నేర్చుకుంటున్న ‘ఉప్పెన’ బ్యూటీ