నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు అనుమతి ఇచ్చిన సమయం కన్నా ముందే టిక్రీ, ఘజీపూర్ సరిహద్దుల వద్ద రైతులు ట్రాక్టర్ల ర్యాలీ ప్రారంభించారు. దీంతో పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. టిక్రీ సరిహద్దు వద్ద బారికేడ్లను తొలగించుకుని రైతులు ట్రాక్టర్ల ర్యాలీకి ప్రయత్నించడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ అలుముకుంది.
ఘాజీపూర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ
ఢిల్లీ సరిహద్దులోని ఘాజీపూర్ నుంచి రైతుల ట్రాక్టర్ల ర్యాలీ ప్రారంభమైంది. ఉదయం రిపబ్లిక్ డే పరేడ్ ఉన్నందున మధ్యాహ్నం ఒంటిగంట తరవాత ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే, రైతులు ఉదయం పదకొండు గంటలకే ర్యాలీ ప్రారంభించారు. ఘాజీపూర్, టిక్రీ సరిహద్దుల ద్వారా ఢిల్లీలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారకేడ్లను రైతులు తొలగించారు. దీంతో రైతు సంఘాల నాయకులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారని తెలుస్తోంది. ట్రాక్టర్ల ర్యాలీ సాయంత్రం వరకూ కొనసాగే అవకాశం ఉంది.
Must Read ;- వివాదాస్పద సాగు చట్టాల నిలిపివేతకు కేంద్రం అంగీకారం











