మద్దతు తెలిపిన 23 వేల మంది టీటీడీ ఉద్యోగులు!
కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగుల గత పదిరోజులుగా ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి నిరసనను గట్టిగానే తెలియజేస్తున్నారు. వీరు చేస్తున్న నిరసనలకు మద్దతుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు కూడా ముందకొచ్చారు. టీటీడీలో 6500 మంది రెగ్యులర్ ఉద్యోగులు, సొసైటీల కింద 7 వేల మంది, కాంట్రాక్టు, ఎఫ్ఎంఎస్ ల కింద మరో 7500 మంది, పీస్ రేటు, సంభావన కేటగిరీల కింద ఇంకో 2 వేల మంది.. ఇలా మొత్తం 23 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరే కాకుండా మరో 10 వేల మంది పెన్షనర్లు కూడా ఉన్నారు. వీరిలో రెగ్యులర్ ఉద్యోగులకు, పెన్షనర్లకు పీఆర్సీ వర్తిస్తోంది. అయితే టీటీడీ ఉద్యోగుల జీతభత్యాలు బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అయితే పెరిగిన కొత్త జీతాలను చెల్లిచే సమయంలో తప్పకుండా వేతనాలు తగ్గుతాయన్న ఆందోళన మాత్రం ఉద్యోగుల్లో ఉంది. అందుకే టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన బాట పట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది! ఈ కారణంగానే ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటిస్తున్నారు.
‘చలో విజయవాడ’ కార్యక్రమంలో పాల్గొననున్న టీటీడీ ఉాద్యోగులు!
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు ఇప్పటి వరకూ నేరుగా ఆందోళనకు దిగలేదు కానీ సంఘాల నేతలు మాత్రం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమావేశాలకు, ఆందోళనలకు హాజరవుతున్నారు. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమానికి నాయకులంతా వెళ్ళేందుకు సమాయక్తం అవుతున్నారు. అయితే ఫిబ్రవరీ 7వ తేదీ నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగే విషయంపైనా టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలు తర్జన భర్జన పడుతున్నారు. దీనిపై మంగళవారం సంఘాల నేతలంతా సమావేశమై భవిష్యత్తు కార్యచరణను ప్రకటించనున్నారు. తొలిదశలో భక్తులతో సంబంధంలేని ఇతర విధులను బహిష్కరించి, నిరసన తెలపాలని సమాయక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు ప్రత్యక్షంగా సమ్మెకు దిగితే శ్రీవారి ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉందని పాలక మండలి బంధనాలు వేస్తుంది. మొత్తంగా మంగళవారం టీటీడీ ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం అనంతరం నిరసనలు, సమ్మె విషయంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి!
Must Read:-ప్రయత్నించి చూడు.. ప్రగతి రథచక్రం ఆగకుంటే ఓట్టు..!











