అనుష్క, మాధవన్ నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. రివ్యూల పరంగా మిశ్రమ ఫలితాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల పరంగా మంచి కలెక్షన్లను వసూలు చేసిందని ఆ చిత్ర బృందం చెబుతోంది. ఇదిలావుండగా..ఆ చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ కు ఇప్పుడు రెండు కొత్త చిత్రాలకు దర్శకత్వం వహించే అవకాశాలు వచ్చినట్లు సమాచారం. వాటిలో ఒకటి యాక్షన్ రొమాంటిక్ చిత్రమని, దీనికి .రచయిత గోపీమోహన్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారట. ఈ చిత్రం కూడా ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని తీసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే నిర్మించనున్నట్లు వినిపిస్తోంది.
మరో చిత్రం బాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాగా తెరకెక్కనున్నట్లు తెలిసింది. లోగడ బాలీవుడ్‌లో ‘ఏ ఫ్లాట్’ అనే చిత్రం ద్వారా గుర్తింపు సంపాదించుకున్న హేమంత్ తాజాగా ‘బాతే’ అనే పేరుతో ఈ మల్టీస్టారర్ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఈ హిందీ చిత్రానికి ‘కహానీ, పింక్’ చిత్రాల రచయిత రితేష్ షా స్క్రీన్‌ప్లే అందిస్తారని తెలిసింది. ఈ చిత్రం మూడొంతులు చిత్రీకరణ లండన్‌లో జరగనుందని అంటున్నారు.. త్వరలోనే ఈ రెండు సినిమాల వివరాలు అధికారికంగా ద్రువీకరించబడతాయని సమాచారం.
Must Read ;- బాలీవుడ్ చిత్రాల్లో హైదరాబాద్ భామ అమ్రిన్ ఖురేషి