Is Tamanna Removed From Masterchef Program
తమన్నా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. క్యారెక్టర్ ఏదైనా సరే.. పెర్ ఫెక్ట్ అన్నట్టుగా నటిస్తుంది. మెప్పిస్తుంది.. అందుకనే అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది. మిల్కీబ్యూటీ అనే పేరు తెచ్చుకుంది. తనకున్న క్రేజ్ తో సినిమాల్లోనే కాకుండా.. వెబ్ సిరీస్ లు, యాడ్స్ లో బుల్లితెర పై కూడా నటిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే.. మిల్కీ బ్యూటీ తమన్నా జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న మాస్టర్ చెఫ్ అనే ప్రోగ్రామ్ చేస్తుంది.
తమన్నా హోస్ట్ గా చేస్తుండడంతో రేటింగ్స్ సూపర్ అనేలా వస్తాయి అనుకున్నారు కానీ.. ఆశించిన స్ధాయిలో రేటింగ్స్ రావడం లేదు. దాంతో తమన్నా విషయంలో నిర్వాహకులు కూడా అంత ఆసక్తి చూపించడం లేదని వార్తలు వస్తున్నాయి. హీరోయిన్‌గా ఆమెకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకున్న నిర్వాహకులు కూడా తమన్నాకు ఊహించని రెమ్యునరేషన్ ఇచ్చారు. అయినా కూడా షోను సక్సెస్ ఫుల్‌గా నడిపించడంలో.. రేటింగ్స్ తీసుకురావడంలో తమన్నా దారుణంగా విఫలమైందని నిర్వాహకులు భావిస్తున్నారు.
దీంతో ఆలోచనలో పడ్డ నిర్వాహకులు తమన్నాను తప్పించాలని డిసైడ్ అయ్యారని సమాచారం. అగ్రిమెంట్ ప్రకారం.. తమన్నాతో చిత్రీకరించాల్సిన ఎపిసోడ్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆమెకు టాటా చెప్పేస్తారని సమాచారం. ఆమె ప్లేస్ లో యాంకర్ టర్నడ్ యాక్ట్రస్ అనసూయను రంగంలోకి దింపనున్నారని టాక్ వినిపిస్తోంది. మరి.. అనసూయ ఎంత వరకు మెప్పిస్తుందో..? ఆమెతో అయినా మాస్టర్ చెఫ్ కి రేటింగ్ పెరుగుతుందేమో చూడాలి.
Must Read ;- ఇంత లేటు వయసులో అంత హాట్ అవసరమా?











