ఇప్పుడు అంతా కూడా ‘ఉప్పెన’ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. నిజానికి బడ్జెట్ పరంగా చూసుకుంటే ‘ఉప్పెన’ చిన్న సినిమా. హీరోకి ఇది మొదటి సినిమా .. హీరోయిన్ కి మొదటి సినిమా .. అలా అని చెప్పేసి దర్శకుడికి చాలా అనుభవం ఉందా అంటే, ఆయనకి కూడా ఇదే మొదటి సినిమానే. మరి ఇలాంటి సినిమాను గురించి అంతా మాట్లాడుకుంటున్నారంటే, అందులో కచ్చితంగా విషయం ఉందనే కదా అర్థం. ఆ విషయాన్ని గ్రహించడం వల్లనే కదా అంతా ఆ సినిమాపై దృష్టి పెడుతున్నారు.
‘ఉప్పెన’ సినిమా విడుదల కాకముందే హీరోయిన్ బిజీ అయింది .. హీరో దగ్గరికి కూడా మంచి మంచి కథలే వస్తున్నాయి. అంతేకాదు .. ఈ దర్శకుడితో కలిసి సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారట. అందువలన ఒక స్టార్ హీరోతో సినిమా చేయడానికి ఈ దర్శకుడు కమిట్ అయినట్టుగా ఆయనే స్వయంగా చెప్పాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించ నున్నా రనే విషయాన్ని కూడా స్పష్టం చేశాడు. అందుకే ఈ ప్రాజెక్టు ఖాయమైపోయిందనే అనుకోవాలి.
తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, “సుకుమార్ గారితో కలిసి పనిచేస్తున్నప్పుడే నేను కొన్ని కథలను రెడీ చేసుకున్నాను. నాకు గ్రామీణ నేపథ్యంతో కూడిన కథలు ఇష్టం. అందువల్లనే ఆ తరహా కథలనే తయారు చేసుకుంటాను. ‘ఉప్పెన’ కొత్తగా అనిపించడంతో ప్రధానమైన పాత్రను పోషించింది గ్రామీణ నేపథ్యమే.ఇది మన కథ అనే ఫీల్ ప్రేక్షకులకు కలిగించగలిగితే అక్కడే సక్సెస్ అయినట్టుగా భావిస్తాను” అని చెప్పుకొచ్చాడు. తన తదుపరి సినిమా చేసే ఆ స్టార్ హీరో ఎవరనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టేశాడు.
Must Read ;- ఎన్టీఆర్ ను మరిచిపోలేనంటున్న ఉప్పెన హీరో!











