టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుకుమార్ ఫస్ట్ మూవీతోనే సక్సస్ సాధించి ఇంటిలిజెంట్ డైరెక్టర్ అనిపించుకున్నారు. వన్ సైడ్ లవ్ అంటూ ప్రేమలో కొత్త కొణాన్ని ఆవిష్కరించారు. యూత్ ని బాగా ఆకట్టుకున్నారు. ఆతర్వాత రామ్ తో జగడం సినిమా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

ఆర్య 2, 100% లవ్, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం.. ఇలా డిఫరెంట్ స్టోరీస్ తో సినిమాలు తెరకెక్కించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. సుకుమార్ తెరకెక్కించిన సినిమాల్లో కొన్ని ఆశించిన స్ధాయిలో మెప్పించలేకపోవచ్చు కానీ.. ఆయన కథలో మాత్రం కొత్తదనం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ పుష్ప అనే పాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాకి సుకుమార్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కారణం ఏంటంటే.. సుకుమార్ పుష్ప చిత్రానికి గాను 23 కోట్లు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అఫిషియల్ గా ఎలాంటి సమాచారం లేదు కానీ.. హాట్ టాపిక్ గా నిలిచింది. మారేడుమిల్లిలో షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప షూటింగ్ సమ్మర్ ఎండింగ్ కి కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Must Read ;- రష్మిక.. బాలీవుడ్ ఎంట్రీ ‘పుష్ప’ మూవీకి కలిసొస్తుందా.?











