గుంటూరు: జిల్లాలో వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ దేవళ్ళ రేవతి హంగామా సృష్టించారు. కాజా టోల్ గేట్ వద్ద సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. టోల్ ఫీజ్ కట్టకుండా వెళ్తున్న రేవతి కారుకు టోల్ గేట్ సిబ్బం బారికేడ్లను అడ్డుపెట్టారు. దీంతో ఆగ్రహంతో కారు దిగిన రేవతి హల్‌చల్ చేశారు. తన కారు ఆపుతారా అంటూ సిబ్బందిపై దాడి చేసి… బారికేడ్లను తోసేశారు. రేవతి హడావుడితో టోల్ గేట్ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. తోటి వాహనదారులు ఆశ్చర్యపోయారు. టోల్‌గేట్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదేం దాష్టీకం
టోల్ గేట్ వద్ద రుసుము చెల్లించడం అనేది ఎంత గొప్ప వారికైనా తప్పదు. టోల్ చెల్లింపునుంచి మినహాయింపు ఉండే ఒకస్థాయి నాయకులు, అధికారుల వాహనాలు తప్ప ఎవరైనా చెల్లించి తీరాల్సిందే. కానీ.. అధికార పార్టీ అయితే.. చాలు తమకు చాలా ప్రత్యేక హక్కులు ఉంటాయని, తాము అసామాన్యమైన మనుషులమని అనుకునే వారు కొందరుంటారు. అలాంటి రకమే వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ రేవతి కూడా అని విమర్శకులు అంటున్నారు. ఈ వ్యవహారాన్ని అందరూ ఖండిస్తున్నారు.
Must Read ;- పార్టీ తీరుపై నోరు జారుతున్న సొంత ఎమ్మెల్యేలు.. ఇరకాటంలో వైసీపీ
వైసీపీ మహిళా నేత దాష్టీకం వీడియోలు చూడండి :