మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే.. ఈ పెళ్లిలో నిహారికకు పెదనాన్న చిరంజీవి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చాడని వార్తలు వచ్చాయి. దీంతో చిరు ఏ గిఫ్ట్ ఇచ్చారనేది హాట్ టాపిక్ అయ్యింది. 2 కోట్లు విలువైన నెక్లెస్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. అయితే.. దీనికి సంబంధించి ఎలాంటి వీడియో కానీ.. ఫోటో కానీ బయటకు రాలేదు. ఈ విషయం పక్కనపెడితే.. నిహారికకు మెగా ఫ్యామిలీ తరుపున దాదాపు 5 కోట్లు విలువైన బహుమతులు అందాయని తెలిసింది. చిరంజీవి తనకు తెలిసిన వాళ్ల పెళ్లిల్లోనే కాస్ట్ లీ గిఫ్ట్ లు ఇస్తుంటారు.
అలాంటిది తన కుటుంబంలో పెళ్లి జరిగితే.. ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఖాయం. ఇంకా చెప్పాలంటే.. వాళ్లకు ఏం కావాలో అడిగి మరీ గిఫ్ట్ లు ఇవ్వడం చిరంజీవికి అలవాటు. చాలా కాలం క్రితం చిరంజీవి తోడల్లుడు కూతురు పెళ్లిలో లక్షల విలువైన బహుమతులు ఇచ్చారు. ఇక సొంత తమ్ముడు కూతురు పెళ్లి అంటే.. ఏ రేంజ్ లో గిప్ట్ ఉంటుందో ఊహించుకోవచ్చు. చిరంజీవే కాకుండా.. తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా కాస్ట్ లీ గిప్ట్ ఇచ్చారు అంటున్నారు కానీ.. పవన్ కళ్యాన్ ఏ గిఫ్ట్ ఇచ్చారనేది బయటకు రాలేదు.
ఇక చెల్లెలు నిహారికకు రామ్ చరణ్ కూడా గిఫ్ట్ ఇచ్చారట. మరో విషయం ఏంటంటే.. పెళ్లి జరిగింది తన ఇంటిలోనే అయినా.. అన్నయ్య వరుణ్ తేజ్ కూడా చెల్లెలు నిహారికకు గిఫ్ట్ ఇచ్చారట. అలాగే అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా గిఫ్ట్ లు ఇచ్చారని… మొత్తానికి మెగా హీరోలందరూ కలిసి ఇచ్చిన బహుమతుల విలువ దాదాపు 5 కోట్లు ఉంటుందని అంటున్నారు.
Must Read ;- కాబోయే జంట నిహారిక, చైతన్య డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్.