అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం లవ్ స్టోరీ. ఇందులో చైతన్య సరసన ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటిస్తోంది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇందులో నాగచైతన్య తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడుగా నటిస్తున్నారు. కథ విషయానికి వస్తే… శేఖర్ కమ్ముల ఈసారి సమాజంలో ఉన్న ఓ సమస్యను కథావస్తువుగా తీసుకున్నారని… ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుందని తెలిసింది.
ఈ సినిమాని క్రిస్మస్ కి కానీ.. సంక్రాంతికి కానీ రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆతర్వాత సంక్రాంతికే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయకపోయినా… సంక్రాంతికి రావడం మాత్రం పక్కా అనుకున్నారు. అయితే… ఇప్పుడు లవ్ స్టోరీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్టు సమాచారం. ఈ అక్కినేని హీరో నాగచైతన్యనే కాకుండా… చైతన్య బ్రదర్ అఖిల్ అక్కినేని కూడా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే… అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.
బన్నీ వాసు – వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆ తర్వాత అఫిషియల్ గా ఎనౌన్స్ చేయడం కూడా జరిగింది. అయితే… ఇప్పడు థియేటర్లు ఓపెన్ చేసినప్పటికీ… 50 శాతం ఆక్యుపెన్సీతోనే రన్ చేయాలి అని ప్రభుత్వం జీవో ఇచ్చింది.
అయితే…50 శాతం ఆక్యుపెన్సీతో కొత్త సినిమా రిలీజ్ చేస్తే… లాభాలు రావని.. సంక్రాంతికి రిలీజ్ చేయడం లేదని తెలిసింది. నాగచైతన్య లవ్ స్టోరీ, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాలను సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. మరి.. సమ్మర్ లో రానున్న లవ్ స్టోరీ చైతన్యకు హ్యాట్రిక్ ని, అఖిల్ కి ఫస్ట్ సక్సస్ ని అందిస్తుందని ఆశిద్దాం.
Must Read ;- ఒక్క వీడియోతో సస్పెన్స్ లో పడేసిన అఖిల్. ఇంతకీ.. ఏంటది..?











