సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. అర్జున్ సినిమా పైరసీ జరిగినప్పుడు మహేష్ కి సపోర్ట్ గా నిలిచాడు పవన్ కళ్యాణ్. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకి మహేష్ వాయిస్ ఓవర్ అందించడం తెలిసిందే. పవన్ తో మంచి అనుబంధం ఉన్నందున త్రివిక్రమ్ అడిగిన వెంటనే జల్సా మూవీకి వాయిస్ అందించడానికి వెంటనే ఓకే చెప్పారు. అప్పట్లో అదో సంచలనం. మహేష్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయ్యే జల్సా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే.
అయితే.. మళ్లీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓకే సినిమాలో కనిపించనున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏ సినిమాలో అంటారా..? ‘సర్కారు వారి పాటలో’. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే…విభిన్న కథాంశంతో రూపొందే ఈ సినిమాలో ఓ కీలక పాత్రకి పవన్ కళ్యాణ్ అయితే.. బాగుంటుంది అనుకున్నారట చిత్రయూనిట్. ఇటీవల పరశురామ్ పవన్ కళ్యాణ్ ని కలిసి ఆ పాత్ర గురించి చెప్పారని తెలిసింది.
మహేష్ తో స్నేహం ఉన్న కారణంగా ఇందులో నటించేందుకు ఓకే చెప్పారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరో వైపు వరుసగా సినిమాలు చేస్తున్నారు. మహేష్ మూవీలో పవన్ నటించనున్నారని వార్తలు వస్తుండడంతో అటు మహేష్ అభిమానులు ఇటు పవన్ అభిమానులు ఇది నిజమేనా..? కాదా..? ఆరా తీస్తున్నారు. ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమే అని కొంత మంది అంటుంటే.. మరి కొంత మందైతే.. వరుసగా ఓకే చేసిన తన సినిమాల్లో నటించడానికే టైమ్ లేదు.
ఇక మహేష్ మూవీలో నటించేదుకు ఎందుకు ఓకే చెబుతాడు.? అంటున్నారు. ఒకవేళ మహేష్ మూవీలో పవన్ నటించడం నిజమైతే.. అటు మహేష్ అభిమానులకు, ఇటు పవన్ అభిమానులకు పండగే. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త పై త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.
Must Read ;- మహేష్ లిస్ట్ లో మరో స్టార్ డైరెక్టర్.. ఎవరతడు?