‘జై’ సినిమా ద్వారా తన సినీ కెరీర్ మొదలుపెట్టిన యంగ్ హీరో నవదీప్ అనతికాలంలోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత ‘గౌతమ్ ఎస్.ఎస్.సి’, ‘మొదటి సినిమా’, ‘ప్రేమంటే ఇంతే’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అప్పటివరకు హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవదీప్ తర్వాత కాలంలో పలు వివాదాలలో చిక్కుకున్నాడు. ప్రస్తుతం పలు టీవీ ఛానెల్స్ లో ప్రసారమవుతున్న ‘షో’ ల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు నవదీప్.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు నవదీప్. తాజాగా సోషల్ మీడియా తన అభిమానులతో ముచ్చటిస్తున్న నవదీప్ కు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో ఒకటి ఆయన పెళ్లి గురించి. ఇప్పటికే ఈ ఏడాది అనేకమంది హీరో, హీరోయిన్ల పెళ్లిళ్లు జరిగాయి. మరి మీ పెళ్లి ఎప్పుడు అని ఒక అభిమాని అడిగాడు. అందుకు నవదీప్ చాలా చిలిపిగా సమాధానం చెప్పాడు. ‘ఎందుకు అందరూ నా పెళ్లి కోసం అడుగుతున్నారు. పెళ్లి తప్పకుండా చేసుకోవాలా, నన్ను ఇలా ఒక్కడినే వదిలేండి రా బాబు’ అని సమాధానం ఇచ్చాడు. అంతే కాకుండా యాంకర్ విష్ణుప్రియతో నవదీప్ డేటింగ్ చేస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినపడుతున్నాయి. వాటిపై కూడా స్పందించాడు నవదీప్.
విష్ణుప్రియతో నాకున్నది కేవలం స్నేహం మాత్రమే. మేమిద్దరం డేటింగ్ లో లేము. ఇండస్ట్రీలో నాపై అనేక పుకార్లు వచ్చాయి. అందులో ఇదొకటి. దాని కోసం ప్రత్యేకంగా స్పందించాల్సిన అవసరం లేదు. నేను నా జీవితంలో జరుగుతున్న ఏవిషయాన్ని దాయాను. మా మధ్యన ఉన్న స్నేహాన్ని అర్ధం చేసుకోకుండా కొన్ని పత్రికలు ఇష్టం వచ్చినట్లు రాస్తున్నాయి అని తెలిపాడు నవదీప్. ఇప్పటికైనా నవదీప్ ఇచ్చిన క్లారిటీతో తనపై వచ్చిన పుకార్లు ఆగుతాయో లేదో చూడాలి.
Must Read ;- నిశ్చితార్ధం చేసుకున్న ప్రముఖ గాయని సునీత
Also Read ;- ప్రేమవ్యవహారంపై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్