93 సంవత్సరాల మోతీలాల్ వోరా కన్నుమూసారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన వోరా అక్టోబర్‌లో కరోనా బారిన పడ్డారు. అదే నెలలో 16వ తేదీన కరోనా నుండి కోలుకుని ఇంటికి చేరారు. కానీ మళ్లీ శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఈ నెల 19వ తేదీన చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు (డిసెంబర్ 21) మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
ప్రస్తుతం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ప్రాతినిత్యం వహిస్తున్నారు. దీనితోపాటు ఏఐసిసి జనరల్ సెకరెట్రీగా కొనసాగుతున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేశారు. అలాగే మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 1985-88 వరకు సేవలు అందించారు. ఆపై కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రులుగా పేరుగాంచిన సీనియర్ లీడర్లలో వోరా కూడా ఒకరు.
Must Read ;- కాంగ్రెస్ దిగ్గజం అహ్మద్ పటేల్ కరోనాతో కన్నుమూత











