ఓ . టీ . టీ . ప్లాటుఫార్మ్స్ ఫై ఒకే అంశం ఎంచుకుని , విభిన్న రీతుల్లో ఆ సమస్య చుట్టూ కథలు తీయిస్తున్నారు. ఆలా పరువు హత్యల నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ నలుగురు ప్రముఖ తమిళ డైరెక్టర్స్ తో తీయించిన ఆంథాలజీ వెబ్ సిరీస్ ‘పావ కథైగల్’.. అంటే పాపపు కథలు అని అర్ధం. సుధ కొంగర, విగ్నేష్ శివన్, గౌతమ్ మీనన్, వెట్రి మారన్ ఈ కథలను డైరెక్ట్ చేశారు. ఆ కథలు, వాటి వెనుక ఉన్న వ్యధలు, వాటి తీరు తెన్నులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం…
ఆ కథలేంటి?
తంగం
తంగం అంటే తమిళంలో బంగారం అని అర్ధం .1981 ప్రాంతం లో జరిగిన కథ గా దీన్ని చెప్పారు. చిన్న తనం నుంచి ఆడంగి గా పెరిగిన ముస్లిం కుర్రాడు సత్తార్, తన క్లాస్ మీట్ శరవణన్ మీద ప్రేమ పెంచుకుంటాడు. అందరికీ రేషన్ కార్డ్స్ మీద సరుకులు తెచ్చి పెట్టి, వాళ్ళు ఇచ్చిన రెండేసి రూపాయిలు దాచుకుని ,15 వేల రూపాయిలు దాచుకుంటాడు . ఆ డబ్బులతో బొంబాయి వెళ్లి, ఆపరేషన్ చేయించుకుని , ఆడపిల్ల గా మారాలని సత్తార్ ఆశ. అయితే శరవణన్.. సత్తార్ చెల్లిని ప్రేమిస్తుంటాడు . సత్తార్ తన ప్రేమ త్యాగం చేసి , తన మిత్రుడిని, చెల్లిని కలిపే ప్రయత్నం లో ఏమయ్యాడు అనేది తంగం కథ .మలయాళ నటుడు జయరాం కుమారుడు కాళిదాస్ జయరాం సత్తార్ గా జీవించాడు. భాగ్యరాజా కుమారుడు శాంతను భాగ్యరాజ్ శరవణన్ గా నటించాడు . ఎన్నుకున్న కథాంశం నపుసంసకుడి చుట్టూ తిరిగినా… చాలా టచింగ్ గా కథ ముగించారు. బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన సాంగ్ చాలా బాగుంది . సుధ కొంగర లేడీ డైరెక్టర్ అయి ఉండి, బోల్డ్ గా ఈ సబ్జెక్టు డీల్ చేశారు .
లవ్ పన్న ఉత్తరనుమ్
నయనతార బాయ్ ఫ్రెండ్ , డైరెక్టర్ విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన కథ ఇది . అంజలి ఆదిలక్ష్మి , జ్యోతి లక్ష్మి గా డ్యూయెల్ రోల్ చేసింది. కూతురు డ్రైవర్ ని ప్రేమించిందని , ఆదిలక్ష్మి ని బాత్రూమ్ లో కరెంటు షాక్ తో చంపిస్తాడు తండ్రి. ఆ అమ్మాయి ప్రేమించిన వాడిని , అతని ఫామిలీ తో సహా , ఆక్సిడెంట్ లో చంపిస్తాడు. ఇప్పుడు మరో కూతురు జ్యోతి లక్ష్మి , తన గర్ల్ ఫ్రెండ్ కల్కి తో , బాయ్ ఫ్రెండ్ భరణి తో వస్తుంది . జ్యోతి లెస్బియన్ అని తెలియదు. ఇప్పుడు ఆ తండ్రి , అతని అనుచరులు ఏం చేస్తారు ? ఈ కథ సరదా సరదా గా సాగింది . డైలాగ్స్ బాగున్నాయి. అంజలి అందం గా ఉండటమే కాకుండా , బాగా నటించింది .
వాన్ మగళ్
డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ మీనన్ కి ఈ మధ్య నటన మీద ఎక్కువ ఆసక్తి పెరిగింది . తానే ప్రధాన పాత్రలో ఈ కథలో నటించాడు , కానీ మెప్పించలేకపోయాడు . అతని భార్య గా సిమ్రాన్ నటించింది . స్క్రీన్ ఫై చూడలేనట్లుగా ఉంది సిమ్రాన్. పెద్ద మనిషి కూడా కాని ఒక పదేళ్ల పాపని ఎవరో రేప్ చేస్తే, సమాజంలో ఆ ఫామిలీ ఎటువంటి సమస్యలు ఫేస్ చేస్తుంది అనేది ఈ కథలో చూపించారు. చివరికి తల్లి్ సిమ్రాన్ పాత్ర , పదేళ్ల పాప ని కొండ మీద నుంచి తోసేసి చంపేస్తుంది. కథ అయినప్పటికీ , ఈ ముగింపు ఎంత మాత్రం సమంజసం కాదు . నాలుగు కథల్లో అతి పేలవం గా ఉన్న కథ ఇదే !!
ఒరు ఇరవు
తమిళంలో వెట్రి మారన్ తీసే సినిమాలు ప్రత్యేకం అయినవి . కుల భేదాల నేపద్యాలలో చాలా సినిమాలు తీశారు . ఇప్పుడు ఆయన తీసిన ఈ ఒరు ఇరవు కూడా పరువు హత్య నేపథ్యం లో తీశారు. మధురై ప్రాంతంలో కొంత కాలం క్రితం జరిగిన సంఘటన ఆధారంగా – ఈ కథ తీశారు. తక్కువ కులం వాడిని చేసుకుందని , తన కూతురుని సీమంతానికి తీసుకు వచ్చి , మంచి నీళ్లలో విషం కలిపి చంపేస్తాడు తండ్రి . ఈ తండ్రి కూతుళ్ళ పాత్రలను ప్రకాష్ రాజ్, సాయి పల్లవి పోషించారు . సాయి పల్లవి ఎంత బాగా నటించిందో , మాటల్లో చెప్పలేము . అలాగే ప్రకాష్ రాజ్ ఎక్కడా మోతాదు మించకుండా , చాలా ఇమిడిపోయి పాత్రలో నటించాడు .
ఎలా తీశారు? :
ఈ నాలుగు కథలు చాలా డిస్టర్బ్ చేస్తాయి. అలాగని కథకులని , దర్శకులని , నటీనటుల్ని మెచ్చుకోకుండా ఉండలేం. గమనించాలిసిన మరో విషయం ఏమిటి అంటే – ఈ విదేశీ ఓ . టీ . టీ . ప్లాటుఫార్మ్స్ లస్ట్ స్టోరీస్ అంటూ , పరువు హత్యలు అంటూ నెమ్మది నెమ్మెదిగా భారతీయ మూలలను కదిలిస్తున్నాయి. ఇవి ఎటువంటి పరిణామాలకు దారి తీస్తాయనేది ప్రేక్షకులు గమనిస్తుండాలి.
దర్శకులు : సుధ కొంగర, గౌతమ్ వాసుదేవ మీనన్, వెట్రిమారన్, విఘ్నేష్ శివన్
ఎక్కడ చూడాలి?: నెట్ ఫ్లిక్స్ లో
రేటింగ్ : 3.5 /5
-తోట ప్రసాద్