ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయవద్దంటూ హైకోర్టు తీర్పు ఇచ్చినా పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఇప్పటికే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వాటర్ హెడ్ ట్యాంకులకు వైసీపీ రంగులు వేశారు. తాజాగా గుంటూరులో పాత ద్విచక్ర పోలీసు వాహనాలకు వైసీపీ రంగులు వేసి జిల్లా అర్భన్ ఎస్పీ అమ్మిరెడ్డి ఘనంగా ప్రారంభించడం వివాదాస్పదంగా మారింది.
పోలీసులకు కోర్టు తీర్పులు వర్తించవా?
పోలీసుల ద్విచక్ర వాహనాలకు వైసీపీ రంగులు వేయించిన గుంటూరు అర్భన్ ఎస్పీ అమ్మిరెడ్డి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నాయకులు రంగులు వేయించడం ఒక ఎత్తయితే, ఏకంగా పోలీసు అధికారులు ప్రభుత్వ వాహనాలకు వైసీపీ రంగులు వేయించడంపై మాజీ హోం మంత్రి చినరాజప్ప తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలకు, వారి భజన పరులకు రంగుల పిచ్చి ముదిరిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
Must Read ;- నిద్ర లేచిన నాలుగో సింహం.. చంద్రబాబుపై ఆగ్రహం