పారిశుద్ధ్య కార్మికులు చెత్తను శుభ్రం చేయడం.. తిరిగి చెత్త వేయడం.. వేయందంటూ ఎన్నిసార్లు చెప్పినా ప్రజల్లో మార్పురాలేదు. ఏం చేయాల్లో కార్మికులకు తోచలేదు. అనేక సార్లు చెప్పి చూశారు.. అయినా సరే ఆ ప్రాంతం అక్కడ చెత్త వేయడం మానలేదు. వారి చేత చెత్త వేయడం మాన్పించాలని నిర్ణయించుకున్న విశాఖ మున్సిపల్ అధికారులు కాస్త సరికొత్తగా సినిమా స్టైల్లో ఆలోచించి.. ప్రజల్లో మార్పు తీసుకురాలేకపోయినా.. చెత్త వేయడమైతే మాన్పించారు. అదెలాగో తెలుసుకుందాం రండి..
దేవుని ఫొటోలతో చెత్తకు చెక్..
దేవుని ఫొటోలేంటి? చెత్తేంటి? ఈ రెండింటికి సంబంధం ఏంటనుకుంటున్నారా? అయితే మీరందరూ ఒకసారి ‘మిడిల్ క్లాస్ మెలోడిస్’ సినిమా చూడాల్సిందే. అచ్చం అందులో లాగానే గాజువాక, పెతగంట్యాడ ప్రాంతంలోని ప్రజల చేత చెత్త వేయడం మాన్పించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు ఈ సినిమా సీన్‌ని ఫాలో అయ్యారు. ఆ ప్రాంతంలోని చెత్తను శుభ్రం చేసి అలా వదిలేస్తేనే కదా చెత్త వేస్తున్నారు. అందుకే కాలీగా వదలకుండా చక్కగా రంగుల ముగ్గులు వేసి దేవుని ఫొటోలను పెట్టారు.
అంతే.. తర్వాతి రోజు యధావిధిగా చెత్త వేయడానికి అక్కడికి జనం అక్కడి పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ చెత్త వేయకుండా వెనుదిరిగారు. మొత్తానికి విశాఖ అధికారులు చెత్త వేయకుండా విజయం సాధించనట్లైంది. కానీ దేవుని ఫొటోలు పెడితే తప్ప మనుషుల్లో మరకపోవడం దురదృష్టకరం. నిజానికి మార్పు అని కూడా అనలేం.. కేవలం దేవుని ఫొటోలు ఉండడం వల్ల చెత్ల వేయకూడదనే భావనే తప్ప మార్పు కాదనే చెప్పాలి. మరి అది భయమో లేక భక్తో.. మొత్తానికి విశాఖ మున్సిపల్ అధికారులు ప్రయత్నమైతే ఫలించింది.
స్వచ్ఛంద సంస్ధలు సైతం..
మునుపు కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి ఉపాయాలను పాటించారు. చెత్తను శుభ్రం చేసి అక్కడి గోడలపైన అందమైన బొమ్మలు, నీతి సూక్తులు రాయడం, దేవుని బొమ్మలు చిత్రీకరించడం ద్వారా ప్రజలను కాస్త అదుపు చేయడానికి ప్రయత్నించారు. ఇలాంటి సంఘటనలు నగరాల్లో పలు చోట్ల నమోదవుతూనే ఉన్నాయి. కానీ, ఎన్ని చేసినా ప్రజల్లో స్వతహాగా మార్పు రావాలి. తమ ఇల్లు శుభ్రంగా ఉండాలని ఎలా అనుకుంటారో.. అలాగే పరిసరాలు కూడా శుభ్రంగా ఉన్నప్పుడే వ్యాధులకు చెక్ పెట్టగలం అని ప్రజలు గ్రహించాలి.
Must Read ;- అక్రమ కట్టడాలా.. పతిపక్ష నేతల ఆస్తులా?