త్రివిక్రమ్ శ్రీనివాస్.. ముందుగా రచయితగా కెరీర్ స్టార్ట్ చేశారు. అచ్చ తెలుగులో .. చిన్న పదాలతో పెద్ద అర్ధం వచ్చేలా సంభాషణలు రాయడం త్రివిక్రమ్ స్టైల్. ప్రాసలు, పంచ్ లతో తెలుగు సినిమా సంభాషణల్లో ఓ ఓరవడి క్రియేట్ చేశారు. దర్శకుడు అయిన తర్వాత వేరే సినిమాలకు డైలాగ్స్ రాయడం మానేశారు. మానేశారు అనడం కంటే.. టైమ్ కుదరడం లేదు అనడం సబబు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి కథ రెడీ చేసి ఎన్టీఆర్ ఎప్పుడంటే అప్పుడు స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు.
మార్చి నుంచి ఈ సినిమాని స్టార్ట్ చేయనున్నారు. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ పవన్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కి డైలాగ్స్ రాస్తున్నారు. ఈ సినిమాని జనవరిలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ ఇప్పుడు భారీ, క్రేజీ మూవీకి సంభాషణలు రాయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ.. ఆ భారీ క్రేజీ మూవీ ఏంటంటే.. హిరణ్యకశ్యప. ఈ చిత్రాన్ని గుణశేఖర్ తెరకెక్కించనున్నారు. రానాతో ఈ సినిమా తెరకెక్కించాలనేది గుణశేఖర్ డ్రీమ్. ఎప్పటి నుంచో ఈ సినిమా పై వర్క్ చేస్తున్నారు.
ఈ చిత్రానికి డైలాగ్స్ రాయమని గుణశేఖర్.. త్రివిక్రమ్ ని అడిగారట. త్రివిక్రమ్ రాస్తానని మాట ఇచ్చాటర. త్రివిక్రమ్ కి పురాణాల మీద మాంచి పట్టు ఉంది. అందుకనే గుణశేఖర్ అడిగి ఉండచ్చు. ఈ చిత్రాన్ని దాదాపు 180 కోట్లతో సురేష్ బాబు, హాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించాలి అనుకుంటున్నారు. లాక్ డౌన్ కారణంగా ఆగింది కానీ.. లేకపోతే ఈపాటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి. వచ్చే సంవత్సరం ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తే.. ఈ సినిమాకి మరింత క్రేజ్ రావడం ఖాయం.
Must Read ;- త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్టు అల్లు ‘రామాయణం’