(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
సింహాచలం దేవస్థానంలో భక్తుల దర్శన సమయం మరో రెండు గంటల పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచి దర్శనాలు ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు ఉంటాయని, ఆ నాలుగు గంటల సమయంలో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకోవచ్చని ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళ తెలిపారు.పలువురు భక్తులు,ఆలయ అర్చకుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె చెప్పారు.ఇప్పటి వరకు ఉదయం 7.30 నుంచి 9.30 వరకే దర్శనాలు లభిస్తున్నాయి.మరో రెండు గంటల పాటు దర్శన సమయాన్ని పెంచారు.టికెట్ కౌంటర్ల దగ్గర క్యూ లైన్లలో భక్తులకు ఎలాటి అసౌకర్యం లేకుండా చూస్తామని చెప్పారు.
నేటి నుంచి లడ్డు విక్రయాలు..
దేవస్థానంలో నేటి నుంచి లడ్డు విక్రయాలు ప్రారంభం కానున్నాయి.సుమారు నెలన్నర కాలం తర్వాత దేవస్థానంలో ప్రసాదాల విక్రయాలకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉండడంతో దేవస్థానంలో ప్రసాదాల విక్రయం నిలిపి వేశారు.
Must Read ;- ఏకాంతంగా అప్పన్న చందనోత్సవం











