‘ఏ ఏండకు.. ఆ గొడుగు పట్టడం’ అనే సామెత అందరికీ తెలిసి ఉంటుంది. గొడుగులు కూడా వాతావారణాన్ని బట్టి తన రూపును మార్చుకుంటున్నాయని చెప్పొచ్చు. వర్షం వస్తుందని గొడుగు తీసుకెళ్తే.. చినుకు కూడా పడకపోవచ్చు. వాతావరణం పొడిగా ఉంది వర్షం ఏం వస్తుందిలే అనుకొని బయటకు వెళ్తే.. భారీ వర్షం పడొచ్చు. ఎప్పుడు వర్షం కురుస్తుందో.. ఎప్పుడు ఎండ వస్తుందో చెప్పడం కష్టమే. ఈ సమస్యలకు చెక్ పెట్టేస్తుంది ఈ ఆంబియెంట్ ఆంబ్రెల్లా.
ఈ గొడుగు హ్యాండిల్లోని సెన్సర్ వాతావరణ వెబ్‌సైట్ నుంచి సమాచారాన్ని గ్రహిస్తుంది. నీలి లైటు నాలుగు రకాలుగా వెలుగుతుంది. భారీవర్షం, మెరుపులు, తేలికపాటి వర్షం ఇలా సందర్భాను బట్టి లైట్లు మరుతూ వర్షం కురుస్తుందా.. లేదా అనే విషయాలను చేరవేస్తుంది. ఒకవేళ గొడుగును మర్చిపోతే, అందులోని సెన్సర్ అలర్ట్ కూడా చేస్తాయి. ఇవి ఆప్ ద్వారా ఫోన్‌కే మెసేజ్ పంపుతాయి. ఎక్కడైనా పెట్టి మర్చి పోయినా ఆ లొకేషన్‌నీ మెసేజ్ చేస్తాయి. అంతేకాదు.. వర్షంతోపాటు ఉష్ణోగ్రతనీ చెబుతాయి. ఈ రకమైన అంబ్రిల్లా త్వరలో మార్కెట్లో రానుంది. గొడుగు గొడుగులా కాకుండా మరెన్నో అవసరాలకు ఉపయోగపడనున్నాయి. బ్యాగులా మారిపోయే గొడుగులు, పాటలు వినిపించే గొడుగులు, చీకట్లో మిరిమిట్లు గొలిపే గొడుగులు సైతం మన ముందుకు రానున్నాయి.
Must Read ;- తెలంగాణ రామప్పకు యునెస్కో గుర్తింపు!











