ఝుమ్మందినాధం‘ సినిమాతో తెలుగులో అడుగు పెట్టిన తాప్సీ పన్నూ, ఆ మధ్య లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు మీద అనుచిత వాఖ్యలు చేసి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఆ తర్వాత క్షమాపణలు చెప్పి వరుసగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో, తన పాత్ర కు ప్రాధాన్యత వున్న సినిమాల్లో నటిస్తూ వరుస విజయాలను తన బ్యాగులో వేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా పదేళ్లు గడిచాక ఇప్పుడు ‘అవుట్ సైడర్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా మారింది. తాప్సీ పీక్ లో వున్న సమయంలో నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చింది అనే దానికి విశ్లేషకులు తమదైన బాణీలో సమాధానాలు ఇస్తున్నారు. ప్రస్తుతం ఓటీటీలు కంటెంట్ కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో తాప్సీ వరుస విజయాలతో ముందుకు పోతోంది.
తాప్సీ కి అన్ని భాషల్లో వున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని జీ స్టూడియోస్ ఆమెతో కలిసి సినిమాలు నిర్మించడానికి ముందుకొచ్చింది. ఆ అవకాశాన్ని తాప్సీ అందిపుచ్చుకుంది. వాళ్లతో నిర్మాణ భాగస్వామిగా చేరింది అని విశ్లేషిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ, ‘సూపర్, 30,83 సూర్మ, పికూ ముబాకరన్’ చిత్రాలను నిర్మించిన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, రచయిత ప్రంజల్ ఖంద్ దియాతో కలిసి తాస్పీ సినిమాలు నిర్మించడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ నిర్మాణ సంస్థలో అజయ్ భాల్ దర్శకత్వంలో ‘బ్లర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్ మరియు ప్రంజల్ ఖంద్ దియాలతో కలిసి తాప్సీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 2022 లో విడుదల కానున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. తాప్సీ డెడికేషన్ ను చూసిన వాళ్లు మాత్రం తాప్సీ నిర్మాత గా కూడా సక్సెస్ సాధిస్తుంది అని చెబుతున్నారు.
కాగా తాప్సి లీడ్ రోల్ చేసిన ‘హసీనా దిల్ రుబా’ సినిమా ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఇది ఆమె కెరీర్లో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా. విక్రాంత్ మాస్సే – హర్షవర్ధన్ రాణే కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి వినీల్ మాథ్యూ దర్శకత్వం వహించారు. రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా థిల్లాన్ కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందించారు. టీ సిరీస్ ఫిలిమ్స్ మరియు కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందింది. తెలుగులో చివరిగా ‘గేమ్ ఓవర్ అనే చిత్రంలో నటించింది. ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ అనే చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Must Read ;- అడిగితే తప్పేంటి అంటున్న తాప్సీ!











