టాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఇందులో కథానాయికగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని రిలీజ్ అయిన ఒక పాటకు, టిజర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సరైన హిట్ పడక సతమతమవుతున్న అఖిల్ కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా ద్వారా మంచి హిట్ దక్కుతుందని అనుకుంటున్నారు.
ఈ సినిమా సెట్స్ పైన ఉండగానే అఖిల్ మరో సినిమాను ఓకే చేసిన విషయం తెలిసిందే. తదుపరి సినిమాను అఖిల్, టాలెంటెడ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్నాడు. సురేందర్ రెడ్డి, అఖిల్ బాడీ లాంగ్వేజ్ కు సరిపడా స్క్రిప్ట్ రెడీ చేసాడని, ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా అనేకమంది పేర్లు పరిశీలించిన దర్శకుడు రష్మికా మందణ్ణను కూడా సంప్రదించాడని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు రష్మికాను ఈ సినిమా లో కథానాయికగా ఖాయం చేశారని తాజా సమాచారం.
ఇప్పటికే ఈ సినిమా కథను దర్శకుడు సురేందర్ రెడ్డి హీరోయిన్ రష్మికకు వినిపించాడని ఆమెకు కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని సమాచారం. త్వరలోనే ఈ సినిమాలో కథానాయికగా రష్మికాను అఫీషియల్ గా ప్రకటిస్తారట. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని టాక్. సురేందర్ రెడ్డి – అఖిల్ సినిమాపై టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, సురేందర్ చేస్తున్న సినిమా రెండూ పెద్ద విజయాలు సాధించి అఖిల్ మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ రెండు సినిమాలతోనైనా అఖిల్ భారీ విజయాలు సాధిస్తాడో లేదో చూడాలి.
Must Read ;- అఖిల్ ఐదో సినిమాలో దర్శకుడికి వాటానా?











