పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాపీస్ దగ్గర రికార్డు కలెక్షన్స్ సాధించి నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరి హర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే హరీష్ శంకర్, సురేందర్ రెడ్డిలతో సినిమాలు చేసేందుకు ఓకే చెప్పారు. ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ కోసం పాన్ ఇండియా రైటర్ విజయేంద్రప్రసాద్ ఓ పవర్ ఫుల్ స్టోరీ రాశారని తెలిసింది. పవన్ కళ్యాణ్ అంటే.. విజయేంద్రప్రసాద్ కు విపరీతమైన అభిమానం.
ఆయనకున్న క్రేజ్ స్పూర్తితో బాహుబలి 2 లో ఓ సీన్ రాసినట్టు కూడా ఓ సందర్భంలో చెప్పారు. ఇటీవల ఆలీతో సరదాగా పొగ్రామ్ లో పవన్ కళ్యాణ్ కోసం కథ రాయాలంటే.. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయన పాత సినిమాల్లో కొన్ని సీన్స్ తీసుకుని కథ రాసేయచ్చు అని చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం విజయేంద్రప్రసాద్ కథ రాసారని.. ఈ కథ విని పవన్ కళ్యాణ్ వెంటనే ఓకే చెప్పారని తెలిసింది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు.? నిర్మాత ఎవరు..? అనేది తెలియాల్సివుంది.
ఆల్రెడీ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం విజయేంద్రప్రసాద్ కథ రాసేసారని సమాచారం. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పుడు విజయేంద్రప్రసాద్ పవర్ స్టార్ కోసం కూడా కథ రాయడం విశేషం. ఆయన పవన్ కళ్యాణ్ కోసం ఎలాంటి కథ రాశారు..? పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించనున్నారు.? అనేది ఆసక్తిగా మారింది.
Must Read ;- వకీల్ సాబ్ మళ్లీ వస్తున్నాడు











